Ads
నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబం అంతా కూడా హాజరు అయ్యారు. నందమూరి కుటుంబంతో పాటు, నారా కుటుంబం కూడా ఈ వేడుకకి హాజరు అయ్యారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇందులో మిస్ అయ్యారు. నారా రోహిత్ కూడా ఈ వేడుకకి వెళ్లారు. ఎన్టీఆర్ గత కొంత కాలం నుండి రాజకీయాలకి దూరంగా ఉంటున్న సంగతి. ఎవరైనా రాజకీయాల గురించి ఎక్కడైనా మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా, “ఇది సందర్భం కాదు” అని జూనియర్ ఎన్టీఆర్ ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు.
నిన్న నందమూరి కుటుంబం అంతా కూడా గన్నవరంలోనే ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అక్కడే జరిగింది. అయితే ప్రమాణ స్వీకారం జరిగిన కొంత సమయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గోవా నుండి హైదరాబాద్ కి వస్తున్నట్టు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దాంతో కుటుంబం అంతా గన్నవరంలో ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ గోవా నుండి ఎందుకు వస్తున్నారు అనే ప్రశ్న అందరిలో నెలకొంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గోవాకి పని మీద వెళ్లినట్టు తెలుస్తోంది. దేవర సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. కొంత కాలం క్రితం ఈ సినిమా షెడ్యూల్ ఒకటి గోవాలో జరిగింది.
Ads
ఆ తర్వాత ఇంకొక షెడ్యూల్ ఇప్పుడు మళ్లీ గోవాలో మొదలు అయ్యింది. ఈ సినిమా షూటింగ్ పని పూర్తి చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ కి వస్తున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద ఒక పాట చిత్రీకరణ ఉంది. అది త్వరలోనే జరుగుతుంది. గోవాలో ఈ సినిమా షూటింగ్ కొంత కాలం నుండి జరుగుతోంది. సినిమా సముద్రాల నేపథ్యంలో జరుగుతుంది కాబట్టి సముద్రం ఉన్న లొకేషన్స్ కావాలి. అందుకోసం గోవాని సినిమా బృందం ఎంచుకున్నారు. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదల అయిన పాటకి మంచి స్పందన వచ్చింది.
జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. పబ్లిక్ ఈవెంట్స్ కి హాజరు అవ్వట్లేదు. సమయం అంతా కూడా సినిమా కోసం మాత్రమే కేటాయిస్తున్నారు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో సినిమాని విడుదల చేయాలి అని సినిమా బృందం అనుకుంటున్నారు. అందుకోసం సినిమా బృందం అంతా కూడా కష్టపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా నిర్విరామంగా సినిమా కోసం పనిచేస్తున్నారు. అందుకే ప్రమాణ స్వీకార వేడుకకి కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరు అవ్వలేకపోయారు. దేవర సినిమా మొదటి భాగం ఈ సంవత్సరం విడుదల అవుతుంది. రెండవ భాగం ఎప్పుడు విడుదల అవుతుంది అనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది.