Ads
శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్, జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా రెడీ. ఈ సినిమాలో చిట్టి నాయుడు క్యారెక్టర్ లో నటించి అందరిని నవ్వించిన మాస్టర్ భరత్ గురించి తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భరత్ చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. వెంకీ, కింగ్, దూకుడు, రగడ లాంటి చాలా చిత్రాల్లో బాలనటుడిగా భరత్ తన నటనతో, కామెడీ టైమింగ్ తో చాలా మందికి దగ్గరయ్యాడు.
Ads
భరత్ ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు. అయినా చైల్డ్ ఆర్టిస్ట్ గా భరత్ చేసిన పాత్రలను చూసి ఇప్పటికీ నవ్వుతూనే ఉంటాం. అయితే శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా ‘బాద్ షా. ఈ సినిమాలో బొద్దుగా ఉండే భరత్ సన్నగా కనిపించాడు. అదేంటి ఇలా మారిపోయడేంటి అని అంతా అనుకున్నారు. ఆ తరువాత వచ్చిన ‘ఎబిసిడి’ సినిమలో ఇంకా సన్నబడి అందరికి షాకిచ్చాడు. ఏమైంది, ఎందుకు ఇలా మారిపోయవని ప్రశ్నిస్తే భరత్ అసలు నిజాన్ని చెప్పుకొచ్చాడు.నేను చిన్నపాటి నుండి సినిమాలలోనే నటిస్తూ ఉన్నాను. నా చదువు విషయానికి వస్తే మెడిసిన్ కంప్లీట్ చేసాను. ఇప్పుడు అందులోనే డాక్టరేట్ చేస్తున్నాను. అంతే కాకుండా కోలీవుడ్ లోనూ కొన్ని మూవీస్ చేశాను. అనంతరం చెన్నైలో కాలేజీలో జాయిన్ అయ్యాను. కాలేజ్ చేస్తుండగా పెద్ద ప్రమాదం జరిగింది. దానివల్లే అప్పటి దాకా బొద్దుగా ఉండే నేను సన్నగా అయ్యాను.
ఆ తరువాత జిమ్ లో వర్కవుట్ లు చేస్తున్నప్పుడు రాడ్‌లోని స్ప్రింగ్ నా కుడి కన్నుకి తగిలింది. ప్రస్తుతం ఒకటే కన్ను కనిపిస్తుంది. అయితే డాక్టర్ చెక్ చేసి, కంట్లో బ్లాక్ ఉంటుందని అది మెడిసిన్ వాడితే తగ్గుతుందని చెప్పాడు. కొన్ని రోజులు కళ్ళ జోడు పెట్టుకున్నాను. అయినా అది ఇంకా నయం అవ్వలేదు. ఇప్పటికి కంటిచూపులో ఏలాంటి మార్పు లేదని, ఇంకా ఆ కన్ను కనిపించడం లేదని తెలియచేశాడు.
Also Read: కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీలో పనిమనిషిగా నటించిన ఆమె ఎవరో తెలుసా?