విశాల్ – శ్రియ కలిసి నటించారు అని తెలుసా..? ఈ సినిమా ఎంత మందికి గుర్తుంది..?

Ads

తెలుగు హీరో అయినా కూడా, తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరో విశాల్. విశాల్ నటించిన ప్రతి తమిళ్ సినిమా తెలుగులో విడుదల అవుతుంది. విశాల్ సినిమాలకి తెలుగులో ఉన్న క్రేజ్ అలాంటిది మరి. అయితే, విశాల్ నటించిన కొన్ని సినిమాలు అలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. అందులో ఈ సినిమా కూడా ఒకటి. శ్రియ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పేరు పిస్తా. అసలు విశాల్, శ్రియ కలిసి నటించిన సంగతి కూడా చాలా మందికి తెలియదు. తమిళ్ లో ఈ సినిమా తోరణై పేరుతో రూపొందింది. తెలుగులో ఈ సినిమాని పిస్తా పేరుతో విడుదల చేశారు.

vishal and shriya movie

Ads

2009 లో రూపొందిన ఈ సినిమాకి, సభ అయ్యప్పన్ దర్శకత్వం వహించారు. తమిళ్ తో పాటు, తెలుగులో కూడా ఈ సినిమా రూపొందించారు. విక్రమ్ కృష్ణ ఈ సినిమాని నిర్మించారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఒక తమ్ముడు తన అన్న కోసం వెతుక్కుంటూ వెళ్లడమే ఈ సినిమా కథ. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా, ఆ అంచనాలని అందుకోలేకపోయింది. సినిమాలో పాటలు మాత్రం చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పటికి కూడా చాలా మంది ఈ సినిమా పాటలని వింటూ ఉంటారు. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కొన్ని పాత్రలని తెలుగులో మార్చారు.

తమిళ్ లో ఈ పాత్రల్లో కొంత మంది నటించారు. కానీ తెలుగులో తెలుగు సినిమా వాళ్ళే ఇందులో నటించారు. అసలు ముందుగా ఈ సినిమాని రీమాసేన్ హీరోయిన్ గా, సింగనమల రమేష్ నిర్మించాల్సింది. కానీ తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. మళ్ళీ శ్రియ హీరోయిన్ గా ఈ సినిమా రూపొందించారు. స్టోరీలో తెలిసిన విషయాలు ఉండడం వలన, టేకింగ్ కూడా బాగా రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చూసిన టేకింగ్ అవ్వడం వలన సినిమా అంత పెద్ద హిట్ కాలేదు. ఈ సినిమా తమిళ్ లో, తెలుగులో సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉంది. హిందీలో యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. తమిళ్ తో పాటు, తెలుగులో కూడా ఈ సినిమాకి ఇదే స్పందన వచ్చింది.

Previous articleఈ హీరోలు చేసిన ధైర్యం తెలుగు హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారు..? ఎందుకు ఇంకా అక్కడే ఆగిపోయారు..?
Next articleఅంతా మంచి భార్య నా తల్లి విషయంలో మాత్రమే ఇలా ఎందుకు చేస్తోంది..? నా సమస్యకు పరిష్కారమే లేదా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.