ఈ హీరోలు చేసిన ధైర్యం తెలుగు హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారు..? ఎందుకు ఇంకా అక్కడే ఆగిపోయారు..?

Ads

సాధారణంగా సినిమాలు అన్న తర్వాత ఏ పాత్రలు అయినా పోషించాలి. ఒక వయసు వచ్చిన తర్వాత హీరోలు హీరో పాత్ర పోషించినా కూడా, అందులో వారి వయసుకు తగ్గట్టు వేరియేషన్ ఉండేలాగా చూసుకోవాలి. లేదు అంటే దాని మీద కామెంట్స్ వస్తాయి. కానీ కొంత మంది మాత్రం వయసుకి మించిన పాత్రలు పోషిస్తున్నారు. దాంతో మన తెలుగు హీరోల మీద కామెంట్స్ వస్తున్నాయి. తెలుగు సినిమాల్లో ఎన్నో గొప్ప సినిమాలు వస్తున్నాయి. కానీ ఒక విషయం మాత్రం అలాగే ఉండిపోయింది.

why telugu heroes cant take risk

చాలా మంది సీనియర్ హీరోలు ఇంకా యంగ్ హీరోయిన్స్ తో పాటలు పాడడం, డాన్సులు చేయడం చేస్తున్నారు. ఒకవేళ సినిమాలో ఏదైనా ప్రధాన పాత్ర ఉన్నా కూడా కూతురు లాంటిది అన్నట్టు చూపిస్తున్నారు కానీ, డైరెక్ట్ గా ఒక కూతురికి తండ్రిగా సీనియర్ హీరోలు చేయలేకపోతున్నారు. అందుకు ఉదాహరణ ఇటీవల వచ్చిన భగవంత్ కేసరి సినిమా. అందులో శ్రీలీల, బాలకృష్ణకి కూతురు అని చూపించినా కూడా సినిమా స్టోరీ పెద్దగా మారేది కాదు. తండ్రి మాట వినని కూతురు. ఆ తర్వాత అర్థం చేసుకొని తండ్రి చెప్పిన మాట విని మిలటరీలోకి వెళ్ళింది. ఇలా చూపించినా కూడా సినిమా బాగానే ఉండేది.

Ads

అసలు సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర అంత పెద్ద ప్రాధాన్యత ఉన్న పాత్ర కూడా కాదు. కాజల్ అగర్వాల్ పాత్ర లేకపోయినా కూడా సినిమా బాగానే ఉండేది. హీరో ఉన్నప్పుడు హీరో పక్కన ఒక హీరోయిన్ ఉండాలి అన్నట్టు పెట్టారు. ఇక వీర సింహా రెడ్డి మీద వచ్చిన కామెంట్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. శృతి హాసన్, బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా నటించడం, హనీ రోజ్ బాలకృష్ణకి తల్లిగా నటించడం, వాళ్ళ మధ్య పాటలు, వీటన్నిటి మీద కామెంట్స్ వచ్చాయి.

చిరంజీవి చేసిన రీసెంట్ సినిమాలు కూడా ఇలాగే ఉన్నాయి. మహా అయితే హీరోకి చెల్లెలు ఉంటుంది. కానీ కూతురు మాత్రం ఉండడం కష్టం. మరొక పక్క తమిళ సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు కూడా తండ్రులుగా, లేదా డిఫరెంట్ పాత్రలు చేస్తున్నారు. ఇటీవల విజయ్ సేతుపతి హీరోగా మహారాజా సినిమా వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక సాధారణ మనిషి. ఇలాంటివి తెలుగులో రావట్లేదు. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి ఒక కూతురు కూడా ఉంటుంది. హీరోయిన్ ఉన్నా కూడా సినిమా మొత్తం ఉండదు. అలా అని ఆ హీరోయిన్ స్థానాన్ని భర్తీ చేయడానికి మరొక హీరోయిన్ కూడా ఉండదు.

గత సంవత్సరం వచ్చిన లియో సినిమాలో అయితే. హీరో విజయ్ ఇద్దరు పిల్లల తండ్రిగా నటించారు. హిందీ వాళ్ళు కూడా ఇలాగే తండ్రులుగా నటిస్తున్నారు కానీ మన వాళ్లు మాత్రం ఇంకా హీరోయిన్స్ పక్కన డ్యూయెట్స్ తోనే ఆగిపోయారు అంటూ చాలా కామెంట్స్ వస్తున్నాయి. స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన వారు ఇలాంటి విషయాలు చేస్తే ఇంకా గొప్పగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అలా అవ్వట్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Previous articleజనసేన పార్టీ చిహ్నంలో కేవలం ఈ రంగులు మాత్రమే ఎందుకు ఉపయోగించారు..? ఆ సింబల్ అర్థం ఏంటో తెలుసా..?
Next articleవిశాల్ – శ్రియ కలిసి నటించారు అని తెలుసా..? ఈ సినిమా ఎంత మందికి గుర్తుంది..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.