Ads
ఒక మనిషిని చూసి జడ్జ్ చేసే వాటిలో ఎక్కువ మంది గమనించేది డ్రెస్సింగ్ సెన్స్. ఒక మనిషి వేసుకున్న డ్రెస్ చూసి వారు కాన్ఫిడెంట్ గా ఉన్నారా, భయం గా ఉన్నారా, ఇంకా వేరే విషయాలను కూడా ఎంతో మంది జడ్జ్ చేస్తూ ఉంటారు. ఇవి కొంత వరకు నిజమే అవుతూ ఉంటాయి. కానీ కొంత వరకు నిజం కాకపోవచ్చు. తమ మీద తమకు కాన్ఫిడెన్స్ లేకపోతే, ఏదైనా విషయం వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే ఏ మనిషి అయినా సరే డ్రెస్సింగ్ మీద కానీ, రెడీ అవ్వడం మీద కానీ అంత పెద్దగా శ్రద్ధ పెట్టలేరు.
ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల భయం, వారి బిహేవియర్ పై ప్రభావం పడుతుంది. ఇదే విషయాన్ని ఎన్నో సినిమాల్లో మనకు చూపించారు. కానీ ఒక సినిమాలో మాత్రం ఈ పాయింట్ ని ఇంకొంచెం ఎఫెక్టివ్ గా చూపించారు. అదే డియర్ కామ్రేడ్. డియర్ కామ్రేడ్ సినిమాలో ఫస్ట్ హాఫ్ వరకు రష్మిక మోడ్రన్ గా రెడీ అయ్యి ఉంటారు. సెకండ్ హాఫ్ లో మానేజ్మెంట్ లో ఒకరు రష్మికతో మిస్ బిహేవ్ చేసే ఇన్సిడెంట్ అయిన తర్వాత నుంచి రష్మిక చుడిదార్స్ లో కనిపిస్తారు.
Ads
అలాగే రష్మిక బిహేవియర్ లో కూడా చాలా మార్పులు వస్తాయి. అంతకు ముందు లాగా యాక్టివ్ గా ఉండరు. హీరో కలిసినప్పుడు మామూలుగానే ఉంటారు కానీ మెంటల్ గా చాలా స్ట్రెస్ కి గురవుతూ ఉంటారు రష్మిక. సినిమాలో ఈ సీన్స్ చూసిన తర్వాత రష్మిక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గి అలా బిహేవ్ చేస్తున్నారు అని మనకి అర్థం అయిపోతుంది.
క్లైమాక్స్ లో గట్టిగా అరిచి విషయం మొత్తం చెప్తారు రష్మిక. అంటే తాను ఎదుర్కొన్న సంఘటనల వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గి, భయపడుతూ అలాగే తను చెప్పాలనుకున్నది కూడా చెప్పలేకపోయిన లిల్లీ పాత్ర క్లైమాక్స్ లో తన కోసం తాను నిలబడి, భయాలన్నీ వదిలేసి మాట్లాడి, తను అన్ని రోజులు అనుకున్న స్ట్రెస్ అంతా ఒకటే సారి బర్స్ట్ అవుట్ అయ్యింది అనే విషయాన్ని డైరెక్టర్ మనకి చెప్పారు.