ఓటీటీలో దూసుకెళ్తున్న ఈ సినిమా చూసారా.? ఏకంగా 50 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అంట.?

Ads

అర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఓ సాథియా…గత సంవత్సరం జూలై 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఎక్కువగా ఈ చిత్రం యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం మొత్తం ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

అయితే స్ట్రీమింగ్ అయిన మొదటి రోజే ఓటీటీ లో కూడా ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఈ చిత్రం ఆన్లైన్ లో 50 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ సొంతం చేసుకొని అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తోంది. కేవలం తెలుగు భాషలోనే కాకుండా ఈ చిత్రానికి మిగిలిన భాషల్లో కూడా వ్యూస్ బాగానే వస్తున్నాయి. మంచి యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉన్న ఈ చిత్రం ఒక ఆహ్లాదమైన అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తోంది.

Ads


ఇక కథ విషయానికి వస్తే.. బీటెక్ చదివే అర్జున్‌( ఆర్యన్‌ గౌర),కీర్తి (మిస్తీ చక్రవర్తి) ను ఫస్ట్ లుక్ లోనే లవ్ చేస్తాడు. అయితే అదే కాలేజీలో అర్జున్ అంటే నచ్చని మరో స్టూడెంట్ కూడా కీర్తి పై మనసు పారేసుకుంటాడు. అంతటితో ఆగకుండా లవ్ చేస్తున్నాను అని ఆమె వెంట పడతాడు. ఇక వాడి గోల వదులుచుకోవడం కోసం అర్జునుని లవ్ చేస్తున్నట్లు అబద్ధం చెప్పి కీర్తి అర్జున్ తో క్లోజ్ గా ఉంటుంది.

అయితే అర్జున్ ధైర్యం చేసి కీర్తికి లవ్ ప్రపోజ్ చేద్దాము అని ఆమెకు ఫోన్ చేస్తే…ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. ఏమైందబ్బా.. అన్న టెన్షన్ తో ఇంటికి వెళ్లిన అర్జున్ కి తాళం వేసిన ఇల్లు మాత్రమే కనిపిస్తుంది. అసలు కీర్తి అక్కడికి వెళ్ళింది? ఆమె ఏమైందో అన్న బాధతో పిచ్చివాడిగా మారిన అర్జున్ తిరిగి ఎలా మామూలుగా మారుతాడు? కీర్తి ప్రేమను పొందడం కోసం అతను చేసిన ప్రయత్నాలు ఏమిటి? ఇంతకీ వీరి కథ సుఖాంతమా ? తెలుసుకోవాలి అంటే వెంటనే అమెజాన్ ప్రైమ్ లో ఈ స్టోరీని చూసేయండి.

Previous article”ముగ్గురు మొన‌గాళ్లు” సినిమాలో చిరంజీవికి డూప్ గా నటించిన వాళ్లెవరో మీకు తెలుసా..?
Next articleఆత్మవిశ్వాసం లేకపోతే మనుషులు ఇలా అవుతారా..? డియర్ కామ్రేడ్ లో ఈ విషయం గమనించారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.