Ads
తమిళ హీరోలకి తెలుగులో కూడా చాలా మంది అభిమానులు ఉంటారు అన్న సంగతి తెలిసిందే. అలా తమిళ హీరో అయినా కూడా, తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరోల్లో విజయ్ ఒకరు. గత సంవత్సరం లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సంవత్సరం గోట్ సినిమాతో అలరించబోతున్నారు. విజయ్ రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టారు. కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత రాజకీయాల వైపు వెళ్తారు. పూర్తి దృష్టి రాజకీయాల మీద సారిస్తారు. విజయ్ సినిమాల గురించి అందరికీ తెలుసు. కానీ వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ మందికి తెలియదు.
విజయ్ భార్య పేరు సంగీత సొర్ణలింగం. అప్పుడప్పుడు విజయ్ సినిమా ఈవెంట్స్ ఏదైనా ఉంటే అందులో సంగీత కనిపిస్తూ ఉంటారు. విజయ్ కి మొదట హిట్ తీసుకొచ్చిన సినిమా పూవే ఉనక్కాగ. ఈ సినిమాతో విజయ్ కి హీరోగా గుర్తింపు దక్కింది. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత విజయ్ చెన్నైలో ఉన్న ఫిలిం సిటీలో తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. షూటింగ్ సమయంలో విజయ్ లేడీ అభిమాని వచ్చి విజయ్ నటనని అభినందించారు. ఆమె సంగీత. సంగీత తండ్రి శ్రీలంకకి చెందిన ఒక వ్యాపారవేత్త. యూకే లో స్థిరపడ్డారు.
Ads
చెన్నైకి వచ్చినప్పుడు విజయ్ ని కలిసి మాట్లాడాలి అని సంగీత అనుకున్నారు. అందుకే విజయ్ ని కలిసి మాట్లాడి, తనకి విజయ్ నటన నచ్చింది అని చెప్పారు. ఆ తర్వాత విజయ్ సంగీతని తన ఇంటికి ఆహ్వానించారు. అప్పుడు సంగీత, విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్లి, విజయ్ తల్లిదండ్రులని కూడా కలిశారు. విజయ్ తల్లిదండ్రులకి ఆ సమయంలో విజయ్, సంగీతని ఇష్టపడుతున్న విషయం తెలియదట. విజయ్ ని కలిసిన తర్వాత, సంగీత కొన్నాళ్లు చెన్నైలోనే ఉన్నారు.
అప్పుడు మళ్ళీ విజయ్, సంగీతని తన ఇంటికి రమ్మని పిలిచారు. అప్పుడే విజయ్ తల్లిదండ్రులకి సంగీతని విజయ్ ఇష్టపడుతున్న విషయం తెలిసిపోయింది. సంగీత అంటే కూడా విజయ్ తల్లిదండ్రులకి మంచి అభిప్రాయం ఏర్పడింది. విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ సంగీతని తన కొడుకుని పెళ్లి చేసుకోమని అడిగారు. సంగీత కూడా చంద్రశేఖర్ అడిగిన విషయానికి అంగీకరించారు.
ఆ తర్వాత సంగీత తల్లిదండ్రులని కూడా కలిసి మాట్లాడక విజయ్ కూడా సంగీత తల్లిదండ్రులకి నచ్చారు. అలా వీరిద్దరి పెళ్లి జరిగింది. వీరిద్దరూ 1999 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జేసన్ సంజయ్, దివ్య సాష అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సంగీత చాలా అరుదుగా బయట కనిపిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా లేరు. కానీ తమిళ ఇండస్ట్రీ వారికి మాత్రం సంగీత చాలా బాగా తెలుసు.