మెట్రో ట్రైన్ లో లో “నెక్స్ట్ స్టేషన్ అనౌన్స్మెంట్” చెప్పే వ్యక్తిని ఎప్పుడైనా చూశారా..? ఆయన ఎవరంటే..?

Ads

టెక్నాలజీ పెరుగుతూ ఉంటే, మనుషులకి చాలా పనులు సులువుగా అవుతూ ఉంటాయి. ఎన్నో వస్తువులను ఆవిష్కరించి, ఎంతో మంది ఇలా మనుషులకి ఎన్నో పనులని సులువుగా అయ్యేలాగా చేశారు. వస్తువులు మాత్రమే కాదు, అభివృద్ధి అనేది ఎప్పుడూ మనిషికి సహాయం చేస్తుంది.

హైదరాబాద్ లో అలా అభివృద్ధి చేసిన విషయాల్లో ప్రజలందరికీ ఎంతో సహాయం చేసింది మెట్రో. మెట్రో వచ్చాక ప్రయాణాలు చాలా ఈజీ అయ్యాయి. గతంలో బయటికి వెళ్లాలి అంటే సొంత వాహనం ఉంటే సరే. లేదు అంటే ఆర్టీసీ బస్సుల ప్రయాణం తప్పనిసరిగా ఉండాల్సిందే.

రోడ్ల మీద ట్రాఫిక్ కొన్ని సమయాల్లో ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు సమయానికి లొకేషన్ కి వెళ్లడం కూడా కష్టం అయ్యేది. ట్రాఫిక్ వల్ల ఎన్నో పనులు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో మంది సమయానికి రీచ్ అవ్వలేకపోవడం కూడా అయ్యాయి. మెట్రో మాత్రం ట్రాఫిక్ ని తగ్గించి సగం సమయాన్ని ఆదా చేసింది. 20 నిమిషాలు పట్టే ప్రయాణాన్ని 5 నిమిషాల్లో డెస్టినేషన్ కి చేరుకునేలాగా చేసింది. దాంతో ఇప్పుడు ఆర్టీసీ బస్సుల కంటే మెట్రోలో ఎక్కువ రద్దీ ఉంటుంది. అందుకు కారణం, మెట్రో వాడకం పెరిగింది. మెట్రోలో ప్రయాణించే ప్రతి వారికి అందులో వినిపించే గొంతు పరిచయమే.

man behind hyderabad metro voice

“నెక్స్ట్ స్టేషన్ ఇది” అని చెప్తూ, ఒక మగ గొంతు వినిపిస్తుంది. ఇది చదువుతున్నప్పుడే ఆయన గొంతు మీలో చాలా మందికి వినిపించే ఉంటుంది. అంతగా జనాల్లోకి ఆ వాయిస్ వెళ్ళిపోయింది. వాయిస్ అంత వినిపిస్తుంది కానీ ఆ మనిషి ఎవరు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఆయన పేరు మామా మహేష్. మహేష్ మెట్రోకి వాయిస్ ఓవర్ ఇస్తారు. “తర్వాతి స్టేషన్ జూబ్లీహిల్స్. తలుపులు ఎడమవైపున తెరుచుకుంటాయి” అనే గొంతు మహేష్ ది.

View this post on Instagram

Ads

A post shared by Mama Mahesh (@mamamahesh9)

మహేష్ కేవలం నెక్స్ట్ స్టేషన్ గురించి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కొన్ని హెచ్చరికలు కూడా ఇస్తూ ఉంటారు. “మెట్రోలో ప్రయాణించేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా వేసుకోండి” వంటి జాగ్రత్తలు కూడా మెట్రోలో చెప్తూ ఉంటారు. అలా తన వాయిస్ తోనే చాలా ఫేమస్ అయిపోయారు. హైదరాబాద్ లో మహేష్ వాయిస్ తెలియని వారు కూడా ఎవరూ ఉండరు ఏమో. మెట్రోలో ప్రయాణించే వారికి అయితే ఇంకా బాగా తెలుస్తుంది. కేవలం మెట్రో యాడ్స్ మాత్రమే కాకుండా, ఇంకా ఎన్నో యాడ్స్ కి మహేష్ తన గొంతుని అందించారు. అలా హైదరాబాద్ ప్రజలందరికీ కూడా పరిచయం అయిపోయారు.

ALSO READ : వైయస్ షర్మిల కొడుకు పెళ్లికి ఫోటోగ్రాఫర్ ఎవరో తెలుసా..? ఒక్క ఫోటో సెషన్ కి ఎంత తీసుకుంటారు అంటే..?

Previous articleMuthyala Venkateshwara Rao: అనకాపల్లి స్థానం.. లిస్ట్‌లో ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీఆర్!
Next article“ప్రభాస్” టూ “నాని” మన స్టార్ హీరో హీరోయిన్స్ అసలు పేర్లు ఏవో తెలుసా ?