Ads
ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కల్కి 2898 ఏ.డీ. సినిమా మీద అందరికీ భారీగా అంచనాలు ఉన్నాయి. సినిమా ట్రైలర్ ఇప్పటికే ఆసక్తిని క్రియేట్ చేసింది. సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : కల్కి 2898 ఏ.డీ.
- నటీనటులు : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ.
- నిర్మాత : సి.అశ్విని దత్
- దర్శకత్వం : నాగ్ అశ్విన్
- సంగీతం : సంతోష్ నారాయణన్
- విడుదల తేదీ : జూన్ 27, 2024
స్టోరీ :
భైరవ (ప్రభాస్) కాంప్లెక్స్ లోకి వెళ్లి అక్కడే ఉండిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు. కాంప్లెక్స్ లో అన్ని సదుపాయాలు ఉంటాయి. అందుకే అక్కడ ఉండాలి అని అనుకుంటాడు. ఆ కాంప్లెక్స్ సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) అక్కడ ఉండి ప్రపంచాన్ని ఏలుతూ ఉంటాడు. అతనికి ఒక పెద్ద సైన్యం కూడా ఉంటుంది. భూ ప్రపంచంలో ఎలాంటి సదుపాయాలు ఉండవు. కాశీ పట్టణం ఎటువంటి వనరులు లేకుండా ఉంటుంది. శంబల లో కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. వాళ్లని కాపాడటానికి కల్కి వస్తాడు అని వాళ్లంతా నమ్ముతారు. సుమతి (దీపికా పదుకొనే) కి పుట్టే బిడ్డ కల్కి యాస్కిన్ కి తెలుస్తుంది. సుమతి కాంప్లెక్స్ లో ఉండే ఒక టెస్ట్ కి వాడే సబ్జెక్ట్. సుమతి కాంప్లెక్స్ నుండి తప్పించుకుంటుంది.
దాంతో సుమతిని తన కాంప్లెక్స్ కి తీసుకురావాలి అని తన సైన్యానికి ఆదేశాలు జారీ చేస్తాడు. కల్కిని మోస్తున్న సుమతిని రక్షిస్తాను అని అశ్వద్ధామ (అమితాబ్ బచ్చన్) సుమతికి మాటిస్తారు. యాస్కిన్ మనుషులు భైరవతో మాట్లాడి ఫైవ్ మిలియన్ బౌంటీ ఇస్తాము అని చెప్తారు. ఇందుకోసం బైరవ సుమతిని తీసుకురావాలి అని, ఆ తర్వాత కాంప్లెక్స్ లోకి వెళ్లిపోవాలి అని అనుకుంటాడు. భైరవ సుమతిని తీసుకొచ్చాడా? కాశీ, శంబల ప్రాంతాలని ఎవరు కాపాడారు? అశ్వద్ధామ సుమతిని ఎలా కాపాడారు? సుమతి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సినిమా విడుదలకి ముందే సినిమా బాగుంటుంది అని అందరికీ తెలుసు. కానీ సినిమా ఎంత బాగుంటుందో అని తెలుసుకోవాలి అని ఇన్నాళ్లు ఆసక్తిగా ఎదురు చూశారు. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఈ సినిమాని రూపొందించారు. వాళ్ల కష్టం అంతా కూడా సినిమాలో తెలుస్తుంది. భారీ తారాగణం. భారీ సెట్స్. ఫైటింగ్ సీన్స్. చిన్న విషయాల నుండి వాళ్లు తీసుకున్న జాగ్రత్తలు, ఇవన్నీ కూడా సినిమాలో కనిపిస్తాయి. ముందుగా మెచ్చుకోవాల్సింది నాగ్ అశ్విన్ ని. ఇలాంటి ఐడియా రావడం, దాన్ని తెర మీద చూపించడం సాధారణమైన విషయం కాదు. ఎంతో గొప్ప డిజైనింగ్ ఉంటేనే ఇలాంటి ఐడియాలని తెరపై చూపిస్తారు.
Ads
సినిమాలో కొన్ని ఆలోచించే అంశాలు ఉన్నాయి. పొరపాట్లు జరిగాయి. కానీ సినిమా అంతకంటే గొప్పగా ఉంది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమాలో ఉన్న నటీనటులు అందరూ కూడా చాలా బాగా నటించారు. దీపికా పదుకొనే డబ్బింగ్ విషయంలో సినిమాలో జాగ్రత్త తీసుకున్నారు. దిశా పటానీ పాత్ర పెద్ద చెప్పుకోదగ్గ పాత్ర ఏమి కాదు. హీరో పక్కనే ఉంటారు. ప్రభాస్ తన పాత్రలో చాలా బాగా చేశారు. సినిమాకి ఒక పెద్ద హైలైట్ అమితాబ్ బచ్చన్ అయితే, మరొక పెద్ద హైలైట్ కమల్ హాసన్. అమితాబ్ బచ్చన్ మీదే ఫస్ట్ హాఫ్ అంతా కూడా నడుస్తుంది.
కమల్ హాసన్ కనిపించేది కొంచెం సేపే అయినా కూడా, ఆయనకి ఇచ్చిన డైలాగ్స్ చాలా పెద్దగా అనిపిస్తాయి. ఎంతో అవలీలగా కమల్ హాసన్ తన పాత్ర చేశారు. దీపికా పదుకొనే కూడా తన పాత్రలో చాలా బాగా నటించారు. శోభన, రాజేంద్రప్రసాద్, తమిళ నటుడు పశుపతి, మలయాళం హీరోయిన్ అన్నా బెన్, బ్రహ్మానందం, మాళవిక నాయర్ ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్లందరూ కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. బుజ్జి పాత్రతో కీర్తి సురేష్ వినిపించారు. వీళ్ళందరితో పాటు, అతిధి పాత్రల్లో కనిపించే కొంత మంది కూడా ఉన్నారు. వాళ్లలో నటులు ఉన్నారు, దర్శకులు కూడా ఉన్నారు.
వాళ్లందరూ ఎవరు అనేది మీరు తెర మీద చూస్తేనే బాగుంటుంది. సంతోష్ నారాయణన్ అందించిన పాటల కంటే కూడా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటల విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. ప్రభాస్, దిశా పటానీకి మధ్య వచ్చిన పాట అవసరం లేదు ఏమో అని అనిపిస్తుంది. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. సెట్ డిజైనింగ్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్ డిజైన్ చేసిన విధానం, కాస్ట్యూమ్స్ వీటి గురించి వంక పెట్టడానికి లేదు. కానీ సినిమాలో కొన్ని విషయాల గురించి ఇంకా బాగా చూపించి ఉంటే బలంగా అనిపించేది.
సుమతి కథ ఏంటో చూపించలేదు. అసలు తను ఎక్కడ నుండి వచ్చింది లాంటి విషయాలు చూపిస్తే బాగుండేది. భైరవ కాంప్లెక్స్ లోకి ఎందుకు వెళ్లాలి అనుకుంటాడు అనే విషయాన్ని కూడా బలమైన కారణంతో చూపించలేదు. కొన్ని చోట్ల సినిమా స్పీడ్ తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ మళ్ళీ వెంటనే స్క్రీన్ ప్లే ఫాస్ట్ అవుతుంది. ఎడిటింగ్ విషయంలో కూడా ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అర్థం కానట్టు అనిపిస్తాయి. ఈ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
- భారీ తారాగణం
- స్టోరీ పాయింట్
- నిర్మాణ విలువలు
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
- అక్కడక్కడ సాగదీసినట్టుగా ఉండే కొన్ని సీన్స్
- ఎడిటింగ్ లో మిస్ అయిన ఫ్లో
రేటింగ్ :
3.25/5
ట్యాగ్ లైన్ :
ఇంక వేరే టాక్ వచ్చే ప్రసక్తి లేదు. పెద్దవాళ్ల నుండి చిన్నవాళ్ళ వరకు అందరూ ఈ సినిమాని చూస్తారు. అందరికీ నచ్చే అంశాలు ఇందులో ఉన్నాయి. ఎంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినా కూడా ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన మరొక గొప్ప సినిమాగా కల్కి 2898 ఏ.డీ. సినిమా నిలుస్తుంది.
watch trailer :