వివాదాలలో చిక్కుకుని కెరీర్ పోగొట్టుకున్న యాక్టర్స్ ఎవరో తెలుసా?

Ads

సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సినిమాల ద్వారా పరిచయం అవుతూనే ఉంటారు. వాళ్లలో కొందరు పరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ తమకంటూ స్థానం ఏర్పరుచుకుంటారు. కొందరు అవకాశాలు రాకపోవడంతో పరిశ్రమ నుండి నిష్క్రమిస్తారు. అయితే మరికొందరు ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ వివాదాల్లో చిక్కుకుని, దానివల్ల అవకాశాలు రాకపోవడంతో పరిశ్రమ నుంచి ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు. మరి ఆ ఆర్టిస్టులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
సుమన్:
సుమన్ అప్పట్లో హీరోగా చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. సుమన్ సినిమాలను ఆ సమయంలో ఆడియెన్స్ విపరీతంగా అభిమానించేవారు. సరిగ్గా సుమన్ స్టార్ హీరోగా మరే దశలో అనుకోని సంఘటన ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఒక అమ్మాయికి సంబంధించిన కేసులో ఆయన ఇరుక్కోవడంతో సుమన్ కెరీర్ ను పోగొట్టుకున్నాడని చెప్పవచ్చు. అప్పటి నుండి అవకాశాలు తగ్గిపోయాయి. సుమన్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు విజయం పొందలేకపోయాయి. దాంతో ఆయన హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అలా ఆయన అడపా దడపా వచ్చిన సినిమాలలో నటిస్తున్నాడు.
ఉదయ్ కిరణ్:
ఉదయ్ కిరణ్ ఎంట్రీలోనే వరుసగా మూడు హిట్లు ఇచ్చాడు. టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. పెద్ద పెద్ద బ్యానర్స్ లో ఎన్నో అవకాశాలను అందుకున్నాడు. ఒక దశలో స్టార్ హీరోగా మారుతాడని అనుకున్నారు. అయితే అప్పుడే ఉదయ్ కిరణ్ మెగాస్టార్ చిరంజీవికి అల్లుడు కాబోతున్నాడు. ఆయన పెద్ద కూతురును వివాహం చేసుకోబోతున్నాడు అనే వార్త వచ్చింది. కానీ ఆ తరువాత ఏం అయ్యిందో కానీ హఠాత్తుగా ఉదయ్ కిరణ్ చిరంజీవి కూతురుని వివాహం చేసుకోవట్లేదని తెలిసింది. ఇక ఆయనకి వచ్చిన అవకాశాలన్నీ చేజారిపోయాయి. అక్కడితో ఉదయ్ కిరణ్ కెరీర్ ముగిసిపోయిందని చెప్పవచ్చు. అప్పటి నుండి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఉదయ్ కిరణ్ తన జీవితాన్ని తానే అంతం చేసుకున్నాడు.
చిత్రం శీను:
ఈ నటుడు తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమాతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ మూవీ తరువాత అతనికి వరుస అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. కమెడియన్ గా నిలదొక్కుకుంటున్న సమయంలో రెండవా వివాహం చేసుకున్నాడు. ఆయన మొదటి భార్య చిత్రం శీను మీద కేసు పెట్టింది. అంతేకాకుండా కోర్టు ముందే శీనుని, ఆయన రెండవ భార్యని కొట్టింది. ఆ సంఘటనతో అందరికి అతని పై నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. అప్పటి నుండి సినిమాలలో అవకాశాలు తగ్గాయి. ఇక ఇలాంటివారు పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.

Also Read: స్మోకింగ్ అలవాటును మానేసి, అభిమానులకు ఆదర్శంగా నిలిచిన 10 మంది స్టార్ హీరోలు వీరే..

Previous articleభీమ్లా నాయక్ సినిమా పవన్ కళ్యాణ్ కన్నా ముందు ఏ స్టార్ హీరో వద్దకి వెళ్లిందో తెలుసా?
Next articleతెలుగు సినీ పరిశ్రమలో కొడుకులను కోల్పోయిన ప్రముఖులు వీరే..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.