బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

Ads

సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల తో పాటు ఇతర అనేక అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ సూపర్ పాపులర్ అయ్యారు వేణుస్వామి. ఈ జ్యోతిష్యుడు చెప్పిన చాలా అంచనాలు నిజమయ్యాయి. ఆ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎక్కడా లేని పాపులారిటీ వచ్చి పడింది. ఈ మధ్య వేణు స్వామి వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పారు కానీ అది జరగలేదు. దాని తర్వాత సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని ఒక సంచలన ప్రకటన చేశారు.

తర్వాత ఈ పాపులర్ ఆస్ట్రాలజర్ కనిపించకపోయినా సరే, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఆయన గురించే వీడియోలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్‌లు, మీమ్స్‌ అన్నీ హల్చల్ చేస్తున్నాయి. అయితే వేణు స్వామి ఇంటర్నెట్ యూజర్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా వారు మాత్రం ఆయన్ను వదలడం లేదు. ఆయనకు ఉన్న ఈ క్రేజ్‌ని బిగ్ బాస్ టీం గుర్తించినట్లు ఉంది. అందుకే నెక్స్ట్ సీజన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. వేణు స్వామి కోసమైనా చాలామంది ప్రజలు టీవీలకు అతుక్కుపోతారని బిగ్ బాస్ నిర్వహకులు నమ్ముతున్నారట. ఆ కారణం చేతే ఆయనను సంప్రదించారని, బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేయడానికి వేణు స్వామి కూడా ఒప్పుకున్నారని టీవీ సర్కిల్ లో ప్రచారం జోరుగా సాగుతోంది.

Ads

అంతేకాదు ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఏ సెలబ్రిటీ తీసుకొని పారితోషికం వేణు స్వామి తీసుకుంటున్నారట. మొదటగా ఆయన చాలా రెమ్యునరేషన్ అడిగారని అయితే బిగ్‌బాస్ టీమ్‌ తొలుత సందేహించినా ఆ తర్వాత అతనికున్న క్రేజ్ ను చూసి ఓకే చెప్పిందని సమాచారం. మొత్తం మీద ఈసారి వేణు స్వామి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. హౌస్ లో అడుగు పెట్టాక ఆయన ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తారో ? హౌస్ లో జరగబోయే విషయాలను ముందుగానే జాతకం ద్వారా తెలుసుకొని చెప్పగలరా ? అనేది ప్రస్తుత ఆసక్తికర అంశంగా మారింది.

వేణు స్వామి కాకుండా ఇంకా ఈసారి ఎవరెవరిని తీసుకుంటారనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. బర్రెలక్కను సెలెక్ట్ చేశారని, కుమారి ఆంటీ కూడా సెలెక్ట్ అయ్యారంటూ పలు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సారి వేణు స్వామి ఎంట్రీ తో బిగ్ బాస్ హౌస్ షేక్ అవ్వడం ఖాయం గా కనిపిస్తుంది.

Previous articleకల్కి 2898 ఏడి సినిమాలో “కైరా” గా నటించిన యాక్టర్ ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?
Next articleఆశ్చర్యపరుస్తున్న విరాట్ కోహ్లీ ఆదాయం..! ఒక్కరోజులో ఎంత సంపాదిస్తారంటే..?
Sravan - Movies, offbeat, Sports & Health News Correspondent with 5 years of experience in Journalism