Ads
ఒక సినిమాకి హీరో, హీరోయిన్ ఎంత ముఖ్యమో, సినిమాలో ముఖ్య పాత్రలు పోషించే నటులు కూడా అంతే ముఖ్యం. అందులోనూ, కామెడీ పాత్రలు పోషించే నటులు సినిమాకి చాలా ముఖ్యం. ఎందుకంటే, కామెడీ వల్ల, ఆ పాత్ర పోషించిన నటుల వల్ల హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇది కేవలం ఇప్పుడు మాత్రమే కాదు. ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న విషయం. అందుకే సినిమాకి కమెడియన్స్ అనేవారు చాలా ముఖ్యం అయినవారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కామెడీ పాత్రలు పోషించే నటులు ఉన్నారు. వాళ్లు తెర మీద కనిపిస్తే ప్రేక్షకులకి నవ్వు వస్తుంది. అంటే, వాళ్లు తమ పాత్రలు ఎంత బాగా చేస్తారు అనే విషయం దీని ద్వారా అర్థం చేసుకోవాలి. పైన ఫోటోలో ఉన్న ఒక వ్యక్తి కూడా తన కామెడీతో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.
Ads
ఆయన పక్కన ఉన్న మరొక వ్యక్తి తన రచనలతో గుర్తింపు సంపాదించుకున్నారు. వాళ్ళు ఎవరో ఈపాటికి మీకు అర్థం అయిపోయి ఉంటుంది. వారిలో ఉన్న కమెడియన్ రాజబాబు అయితే, రచయిత శ్రీశ్రీ. రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. అప్పట్లోనే రాజబాబు పారితోషకం ఎక్కువగా ఉండేది. దాదాపు హీరోకి ఇచ్చేంత పారితోషకాన్ని రాజబాబు తీసుకునేవారు.
తన పారితోషకంలో చాలా మొత్తాన్ని కూడా ఎన్నో దాన కార్యక్రమాలకి ఇచ్చారు. రాజబాబుకి, శ్రీశ్రీకి బంధుత్వం కూడా ఉంది. శ్రీశ్రీ భార్య సరోజ, రాజబాబు భార్య అమ్ములు అక్కచెల్లెళ్ళు అవుతారు. ఈ విషయం చాలా మందికి తెలియదు ఏమో. ఇద్దరూ ఎవరి రంగాల్లో వాళ్ళు గుర్తింపు పొందారు. రాజబాబు కామెడీకి గుర్తింపు పొందితే, శ్రీశ్రీ తన రచనలకి గుర్తింపు పొందారు. ఆయన రచనలతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపారు. కమల్ హాసన్ హీరోగా నటించిన ఆకలి రాజ్యం సినిమాలో శ్రీశ్రీ రచనలు ఎన్నో కమల్ హాసన్ చెప్పారు. ఎంతో మంది ఇప్పటికి కూడా శ్రీశ్రీ రచనలని ఆచరిస్తూ ఉంటారు. ఈ ఫోటోని కోరాలో వెంకటరమణ సూరంపూడి గారు షేర్ చేశారు.