“వారి చూపు చాలా ఇబ్బందిగా ఉంది..!” అంటూ… టీచర్ ఎమోషనల్ మెసేజ్..! ఇది చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Ads

టీచర్ అనేది ఒక గౌరవప్రదమైన వృత్తి. టీచర్ ని కూడా తల్లిదండ్రులతో సమానంగా గౌరవిస్తారు. కానీ ప్రతి చోట పరిస్థితి ఇదే రకంగా ఉండదు. ప్రస్తుతం అయితే టీచర్ కి గౌరవం ఇస్తే తప్పు చేసినట్లు భావిస్తున్నారు స్టూడెంట్స్. అలాగే వారు టీచర్ అని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇలా తాను ఎదుర్కొన్న సమస్యల గురించి టీచర్ గా పని చేసే ఒక మహిళ మెసేజ్ రూపంలో ఈ విధంగా చెప్పారు.

teacher

“నేను దాదాపు 15 సంవత్సరాల నుండి టీచర్ గా పనిచేస్తున్నాను. ఈ 15 సంవత్సరాలలో ఎన్నో స్కూల్స్ లో పని చేశాను. ముందు అంతా బానే ఉంది. కానీ గత కొంత కాలం నుండి నేను పని చేసే స్కూల్లో స్టూడెంట్స్ ప్రవర్తన చాలా మారింది. వారి చూపు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళందరూ వయసులో నా కంటే చాలా చిన్న వాళ్ళు. కానీ వాళ్ళ ప్రవర్తన మాత్రం చిన్న పిల్లల ప్రవర్తనలాగా లేదు. స్కూల్ కి ఫోన్ తీసుకురావడం, అందులో ఏవేవో చూడడం, వాటి గురించి డిస్కస్ చేయడం, ఇవన్నీ మా ప్రిన్సిపల్ కి తెలిసినా కూడా ఒకవేళ ఎదురు తిరుగుతారు ఏమో అనే భయంతో తెలిసినా తెలియనట్టు ఉండడం, ఇవన్నీ నాకు ఎందుకో కరెక్ట్ గా అనిపించలేదు.

Ads

నేను పాఠం చెబుతున్నప్పుడు కూడా నన్ను పై నుంచి కిందకు చూడటం, కింద డస్టర్ పడిపోతే నేను అది తీసుకోవడానికి వంగినప్పుడు నా నడుము చూడడానికి ప్రయత్నించడం, ఇలాంటివన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. ఇంక అమ్మాయిలు కూడా నేను క్లాస్ చెబుతుంటే నా వెనకాల నవ్వుకోవడం, క్లాస్ లో నుండి నేను బయటికి రాగానే నన్ను అనుకరించడం నేను చాలా సార్లు చూసాను. గట్టిగా తిడదామన్నా కూడా భయమేస్తోంది. ఎందుకంటే వీళ్లు చేసే పనులు వాళ్ల తల్లిదండ్రులకు తెలియవు కాబట్టి వీళ్లు అమాయకులు ఏమో అనుకొని తల్లిదండ్రులు మమ్మల్ని తిడతారు. సరే వీళ్ళని మేమే కంట్రోల్ లో పెడదాము అనుకొని కొంచెం గట్టిగా మాట్లాడితే మేము ఏదో తప్పు చేసినట్టు ప్రచారం చేస్తారు.

ఇప్పుడు నాకు స్కూల్ కి వెళ్తున్నట్టు లేదు. ఒక్కసారి క్లాస్ కి వెళ్ళాలంటే భయం వేస్తోంది. అది కూడా ఈ వయసు పిల్లలు ఇలా చేస్తున్నారు అంటే ఇంకా ఇబ్బందికరంగా ఉంది.  నేను పాఠం చెప్తుంటే మొదటి బెంచ్ లో కూర్చునే పిల్లాడు నన్ను తినేసేలా చూస్తూ ఉంటాడు. అవసరానికి మించి ఇంటర్నెట్ వాడటం వల్ల పిల్లల మెదడు కల్మషంగా తయారయ్యింది.అంతకుముందు జనరేషన్ పిల్లల్లో కనిపించే అమాయకత్వం ఇప్పుడు జనరేషన్ పిల్లల్లో లేదు. వారి మాటలు కూడా వయసుకి మించి ఉన్నాయి. తమ ఉద్యోగాల్లో, పనుల్లో బిజీ అయిపోవడం వల్ల తల్లిదండ్రులకి కూడా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపడానికి సమయం కుదరట్లేదు. దాంతో వీళ్లు చేసే తప్పుడు పనులు వాళ్ళకి తెలియవు.

ఇది కేవలం నా ఒక్కదాని విషయంలోనే కాదు ఎంతో మంది టీచర్స్ విషయంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.విద్యార్థుల వల్ల తమకు ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు కొంత మంది టీచర్స్ ఎదురు తిరిగి మాట్లాడుతారు. కానీ కొంత మంది మాత్రం “ఒకవేళ అలా మాట్లాడితే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందో” అనే భయంతో మౌనంగానే సర్దుకుపోతారు. బహుశా చాలా మంది రెండవ కోవకు చెందిన వాళ్లే ఉంటారు ఏమో.

Previous articleఈ ఫొటోలో ఉన్న ఒక రైటర్, ఒక కమెడియన్ ఎవరో చెప్పగలరా..?
Next articleశ్రీదేవితో బాలకృష్ణ ఎందుకు నటించలేదు..? కారణం ఇదే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.