Ads
సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న యాక్టర్స్ ని పాన్-ఇండియా స్టార్స్ అని అంటున్నారు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ గుర్తింపు తెచ్చుకున్న నటుడు.
Ads
కోలీవుడ్ సినిమాని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన హీరోల్లో రజినీకాంత్ పేరు తొలి వరుసలో ఉంటుంది. రజినీకాంత్ తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. అంతేకాకుండా ఆయన బాలీవుడ్ లోనూ కొన్ని చిత్రాల్లో నటించారు. రజినీకాంత్ నేరుగా చేసిన తెలుగు సినిమాలు చాలా తక్కువగానే ఉన్నాయి. కానీ రజినీకాంత్ తెలుగు డబ్బింగ్ సినిమాలతో వచ్చిన కూడా తెలుగు ప్రేక్షకులు ఆయనను తెలుగు హీరోలాగానే చూస్తారు.తెలుగులో విడుదలైన రజినీకాంత్ నటించిన డబ్బింగ్ సినిమాల కలెక్షన్స్ కూడా తెలుగు స్టార్ హీరోల సినిమాలకి సమానంగా ఉంటాయి. రజినీకాంత్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఆడియెన్స్ తెలుగు స్టార్ హీరో మూవీ రిలీజ్ కి ఎదురు చూసినంతగా ఎదురు చూస్తూ ఉంటారు.ప్రస్తుతం చాలా మంది కోలీవుడ్ సెలబ్రిటీలు తెలుగు సినిమాలలో నటిస్తున్నారు. వారిలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తెలుగు సినిమాలో నటిస్తే చూడాలని చాలా మంది తెలుగు ఆడియెన్స్ అనుకుంటున్నారు. రజినీకాంత్ ఒక స్ట్రైట్ తెలుగు మూవీలో నటించాల్సి ఉండే, అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఆ మూవీ నుండి తప్పుకున్నారు. ఇంతకి ఆ మూవీ ఏమిటంటే విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.
ఈ మూవీలో రజినీకాంత్ ఏ క్యారెక్టర్ చెయాల్సిందంటే ప్రకాష్ రాజ్ చేసిన రేలంగి మామయ్య క్యారెక్టర్. అయితే రజినీకాంత్ కి ఈ సినిమా స్టోరీ నచ్చడంతో మూవీలో నటించాలని కూడా అనుకున్నారట. అయితే ఆ టైమ్ లో రజినీకాంత్ అనారోగ్య సమస్యలతో ఈ మూవీని చేయలేకపోయారని ఆ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఒక సందర్భంలో తెలిపారు.
Also Read: పవన్ కళ్యాణ్ ‘బాలు’ మూవీ హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా?