పవన్ కళ్యాణ్ ‘బాలు’ మూవీ హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా?

Ads

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉండే క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నటించిన చిత్రాల ఫలితం ఎలా ఉన్నా, ఆయన క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి.

Ads

ఇక పవన్ స్టైల్ కు ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వేసుకునే డ్రెస్ లకి చాలా క్రేజ్ ఉండేది. పవన్ మూవీ వస్తుందంటే చాలు, ఆ మూవీలో పవన్ ఎలా కనిపించబోతున్నారని ఎదురుచూసేవారు. ఇక పవన్ కళ్యాణ్ స్టైల్ కు గురించి చెప్పుకునే చిత్రాల్లో బాలు మూవీ కూడా ఉంటుంది. డైరెక్టర్ కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జంటగా ఇద్దరు హీరోయిన్స్ నటించారు. వారే శ్రియ, నేహా ఒబెరాయ్. హీరోయిన్ శ్రియ గురించి అందరికి తెలుసు. అయితే నేహా ఒబెరాయ్ ప్రస్తుతం ఎలా ఉంది?ఏం చేస్తోంది అనేది చాలా మందికి తెలియదనే చెప్పాలి. మరి ఆమె గురించి తెలుసుకుందాంతెలుగు సినీ ఇండస్ట్రీకి చాలా మంది అందమైన హీరోయిన్స్ ఒక్క సినిమాతోనే వచ్చి, కనుమరుగు అయ్యారు. ఆ జాబితాలో నేహా ఒబెరాయ్ కూడా ఒకరు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ ధరమ్ ఒబెరాయ్ కూతురే నేహా ఒబెరాయ్. ధరమ్ ఒబెరాయ్ కాబిల్,షూట్ అవుట్ లాంటి హిట్ సినిమాలకు డైరెక్షన్ కూడా చేశారు. నేహా బాలు మూవీలో అమాయకమైన అమ్మాయిగా నటించి టాలీవుడ్ ఆడియెన్స్ కి దగ్గరయింది.అప్పట్లో ఈ సినిమా చూసినవారు ఈ అమ్మాయి ఇంత బాగుంది, చక్కగా నటించింది అనే ప్రశంసలు అందుకుంది. బాలు మూవీ తరువాత నేహా తెలుగు చిత్రాల్లో నటించనప్పటికి కూడా టాలీవుడ్ ఆడియెన్స్ బాలు మూవీ హీరోయిన్ గా గుర్తుండిపోయింది. ఆ తర్వాత జగపతిబాబు ‘బ్రహ్మాస్త్రం’ మూవీలో నటించింది. కానీ ఈ మూవీ నిరాశపరిచింది. ఆ తరువాత బాలీవుడ్ సినిమాలలో నటించింది.2010లో బిజినెస్ మెన్ విశాల్ షాను వివాహం చేసుకుంది. ఆ తరువాత సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం ఆమె భర్త బిజినెస్ పనులు చూసుకుంటున్నారు. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. వాటిని చూసినవారు నేహా ఏంటి ఇలా మారిపోయిందని అనుకుంటున్నారు.

Also Read: ‘అన్ స్టాపబుల్’ షో.. పవన్ ఎపిసోడ్ లో బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్..!

Previous articleJawan Review : “షారుఖ్ ఖాన్” హీరోగా నటించిన జవాన్ ఆకట్టుకుందా..?
Next articleశివుడికి ఇలా మూడు సార్లు ప్రదక్షిణం చేస్తే.. పదివేలు సార్లు చేసినట్టే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.