మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సెన్సార్ టాక్.. మెగా మాస్ జాతర..!

Ads

మెగాస్టార్ చిరంజీవి శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాకి బాబీ(కే ఎస్ రవీంద్ర) దర్శకుడు. మాస్ మహారాజా రవితేజ కీలకమైన పాత్రలో నటించారు. ఈ మూవీ సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 13 న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ సందడే కనిపిస్తుంది.

Ads

ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. విడుదల తేదీ దగ్గరపడడంతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనుల్లో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాలోని పాటల, యాక్షన్ సీన్స్, ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని, మెగాస్టార్, మాస్ మహారాజాలను తెరపై చూస్తుంటే పండగలా ఉందని సెన్సార్ మెంబర్స్ తెలిపారు. వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ కి అభినందనలు చెప్పారు.
దీనికి సంబంధించిన పోస్టర్ ని సోషల్ మీడియాలో మైత్రి మేకర్స్ షేర్ చేసింది.ఇప్పటివరకు విడుదలైన టిజర్స్,ట్రైలర్, పాటలతో భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులకి సెన్సార్ టాక్ తో మరింత అంచనాల్ని పెంచింది. ఫ్యాన్స్ కి మరింత ఎనర్జీ యాడ్ చేసినట్లు అయ్యింది. ఇప్పుడు ఈ విషయం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా భారీగా రాబోతున్నాయనే సిగ్నల్స్ ఇస్తోంది. ఇక ఈ మూవీ ఎలా ఉండబోతుందనే విషయాన్ని మెగా ఫ్యాన్స్ అంచనాలు వేసుకుంటున్నారు. అటు మెగాస్టార్ ఫ్యాన్స్, ఇటు మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ పునకాలు లోడింగ్ అంటున్నారు. ఇందులో చిరంజీవి మాస్ లుక్ లో అదరగొట్టబోతున్నారని, ఇక ధియేటర్లలో సీట్లు చిరుగుతాయని, రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయమని అంటున్నారు. అభిమానుల అంచనాలను ఈ మూవీ ఏ మేరకు అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

Also Read: తెలుగులో ముగ్గురు అక్క చెల్లెళ్ళతో నటించిన ఒకే ఒక స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Previous article2022 లో ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ల లిస్ట్..!
Next article2022 లో పాజిటివ్ టాక్ వచ్చినా కూడా విజయం పొందని 10 సినిమాలు..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.