Ads
మెగాస్టార్ చిరంజీవి తన 44 ఏళ్ల కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించారు. వాటిలో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాయి. చిరంజీవి రీమేక్ సినిమాలలో కూడా నటించాడు. అలా ఆయన తన కెరీర్ లో ఇప్పటివరకు 17 రీమేక్ సినిమాలలో నటించారు.
రీమేక్ అనగానే ఉన్నది ఉన్నట్టుగా చేసినప్పుడు అది విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ మెగాస్టార్ రీమేక్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తెలుగు ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగా రీమేక్ అయ్యేలా చూస్తారు. అందువల్లేనేమో మెగాస్టార్ నటించిన రీమేక్ మూవీస్ లో విజయం సాధించిన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. మరి చిరంజీవి నటించిన రీమేక్ సినిమాలు ఏమిటి, వాటి ఫలితాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1) చట్టానికి కళ్ళు లేవు :
ఈ సినిమా తమిళం మూవీ ‘సట్టం ఒరు ఇరుత్తరై’ కి రీమేక్ గా వచ్చింది. ఈ మూవీ విజయం సాధించింది.
2) పట్నం వచ్చిన పతివ్రతలు :
కన్నడ సినిమా ‘పట్టణక్కె బంద పత్నియరు’ కు రీమేక్ గా వచ్చింది. ఇందులో చిరంజీవి, మోహన్ బాబు నటించారు. అయితే ఈ మూవీ విజయం పొందలేకపోయింది. 3) ఆరాధన :
తమిళ సినిమా కడలోర్ కవిదైగళ్ కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా నిరాశ పరిచింది. అయితే ఈ మూవీలోని పాటలు బాగుంటాయి.
4) విజేత :
ఈ మూవీ బెంగాలీ సాహెబ్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. అయితే చిరంజీవికి ఉత్తమ హీరోగా ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది.
5) పసివాడి ప్రాణం :
ఈ సినిమా మలయాళ ‘పూవిను పుతియా పూంతెన్నల్’ మూవీకి రీమేక్. ఈ సినిమా హిట్ గా నిలిచింది.
6) రాజా విక్రమార్క :
ఈ సినిమాను ‘కమింగ్ టు అమెరికా’ అనే ఆంగ్ల సినిమా స్ఫూర్తితో తీశారు.ఈ సినిమా ప్లాప్ అయ్యింది. 7) ప్రతిబంద్ :
మెగాస్టార్ బాలీవుడ్ తొలి సినిమా ‘ప్రతిబంద్’. తెలుగులో విజయం అందుకున్న ‘అంకుశం’ సినిమాకి రీమేక్. అక్కడ ఈ సినిమా నిరాశ పరిచింది.
Ads
8) ఘరానా మొగుడు :
ఈ మూవీ కన్నడ సినిమా ‘అనురాగ అరళితు’ అనే కు రీమేక్. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో రూ.10 కోట్లు వసూల్ చేసిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది.
9) ఎస్.పి.పరశురామ్ :
ఈ సినిమా తమిళంలో వచ్చిన వాల్తేర్ వెట్రివల్ కి రీమేక్. ఈ మూవీ ప్లాప్ అయ్యింది.
10) హిట్లర్ :
మలయాళ సినిమా ‘హిట్లర్’ ను రీమేక్. అదేపేరుతో తెలుగులో చిరంజీవి నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.11) స్నేహం కోసం :
ఈ సినిమా తమిళ ‘నట్పుక్కాగ’ కి రీమేక్. యావరేజ్ గా నిలిచింది.12) ఠాగూర్ :
ఈ సినిమా తమిళ ‘రమణ’ కి రీమేక్. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
13) శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ :
ఈ మూవీ బాలీవుడ్ లో హిట్ అయిన ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ కి రీమేక్. అక్కడి లాగే హిట్ అందుకుంది.
14) ది జెంటిల్ మెన్ :
తెలుగు,తమిళంలో విజయం పొందిన అర్జున్ జెంటిల్ మెన్ ను బాలీవుడ్ లో రీమేక్ చేయగా అక్కడ ప్లాప్ అయ్యింది.15) శంకర్ దాదా జిందాబాద్ :
ఈ మూవీ బాలీవుడ్ లో హిట్ అయిన ‘లగే రహో మున్నాభాయ్’ కి రీమేక్. తెలుగులో ప్లాప్ గా మిగిలింది.16)ఖైదీ నెంబర్ 150 :
ఈ సినిమా తమిళంలో విజయం పొందిన ‘కత్తి’ మూవీకి రీమేక్. మెగాస్టార్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి విజయం పొందారు.
17) గాడ్ ఫాదర్ :
2022 లో రిలీజ్ అయిన ఈ సినిమాకు హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా మలయాళంలో విజయం పొందిన ‘లూసిఫర్’ కు రీమేక్ గా వచ్చింది.
Also Read: పూనకాలు లోడింగ్ పాటలో మెగాస్టార్ చిరంజీవి ధరించిన చొక్కాకి రామ్ చరణ్ కి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?