పూనకాలు లోడింగ్ పాటలో మెగాస్టార్ చిరంజీవి ధరించిన చొక్కాకి రామ్ చరణ్ కి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?

Ads

మెగాస్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీలో కూడా మంచి జోష్ తో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. దర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ శృతి హాసన్ నటిస్తోంది.

ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి, రవితేజ ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌ అపూర్వ రెస్పాన్స్ వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని బాస్ పార్టీ సాంగ్, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి సాంగ్స్ బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయి. ఈ చిత్రం జనవరి 13న సంక్రాంతి పండగకి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ మూవీ టీజర్, ట్రైలర్ లలో మెగాస్టార్ వింటేజ్ లుక్ లో అదరగొడుతున్నాడు. దీంతో ‘వాల్తేరు వీరయ్య’ ఖచ్చితంగా హిట్ అవుతుందని మెగాఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ కీలకమైన క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ మాట్లాడుతూ రవితేజ ఎంట్రీ సెకండ్ హాఫ్ లో ఉంటుందని, అంతేకాకుండా రవితేజ పాత్ర ఈ మూవీకి చాలా ముఖ్యమైనది అని చెప్పాడు. అటు మెగా అభిమానులు, ఇటు మాస్ మహారాజ రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ads

అయితే తాజాగా విడుదలైన పునకాలు లోడింగ్ పాటలో మెగాస్టార్ చిరంజీవి ఎరుపు రంగు షర్ట్ ధరించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఆ షర్ట్ తో ఒక సంబంధం ఉంది. అది ఏమిటంటే రామ్ చరణ్ కూడా ఇలాంటి చొక్కానే ధరించాడు. అది కూడా మీషో యాడ్ లో ఆ చొక్కాతో కనిపించాడు. దీంతో నెటిజన్స్ చిరంజీవి, రామ్ చరణ్ ఎరుపు రంగు చొక్కా ధరించి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Also Read: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సీరియల్ గురించి తెలుసా?

Previous articleషాపింగ్ మాల్స్ టాయిలెట్ల‌లో కింది భాగంలో ఖాళీగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా?
Next articleథియేటర్స్‌లో 50,100,175 రోజుల వరకు ఆడిన టాప్ 10 తెలుగు సినిమాల లిస్ట్..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.