Ads
ట్రైన్ జర్నీ చేయడం ఎంతో కంఫర్ట్ గా ఉంటుంది. దూర ప్రాంతాలకి వెళ్లడానికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అందుకే చాలా మంది రైలు లో ప్రయాణం చేయాలని అనుకుంటూ ఉంటారు. పైగా రైలు లో ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికీ పక్కన కూర్చుని అందమైన ప్రకృతిని చూస్తూ ఉంటే సమయమే తెలియదు. అయితే మీరు కూడా రైలు లో మీరు ప్రయాణం చేస్తూ వుంటారా..?
నిజానికి మనం రైలు లో ప్రయాణం చేస్తూ ఉంటాం కానీ ఆ రైళ్లు ఎలా వెళ్తాయి..?, రైళ్ల రంగులు వంటివి పట్టించుకోము. రైళ్ల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు మీకు తెలియక పోవచ్చు. ఈరోజు రైళ్ల రంగులకి సంబంధించి విషయాలని చూద్దాం.
అన్ని రైళ్ల బండి కి ఒకే కలర్ ఉండదు. అయితే రైళ్ల రంగులు అందానికి వేస్తారు అనుకోవడం పొరపాటు. రైళ్ళ కి ఉండే రంగుల్ని బట్టి మనం కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు. అయితే ఏ రైలు కి ఏ రంగు వేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం.
#1.ఎరుపు రంగు:
రైల్వే కోచ్ కి ఎరుపు రంగు ఉంటే అది అల్యూమినియం తో తయారు చేశారని అర్థం. అవి చాలా తేలికగా ఉంటాయి. గంటకి 200 కిలో మీటర్ల వేగంతో ఇవి వెళ్తాయి. రాజధాని ఎక్స్ప్రెస్, శతాబ్ది వంటి రైళ్ళకి ఎరుపు రంగు ఉంటుంది.
#2. నీలం రంగు:
అదే నీలం రంగు కనుక ఉంటే ఇవి గంటకి 70 నుండి 140 కిలోమీటర్ల వేగం తో ప్రయాణం చేస్తాయి. మెయిల్ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లకి ఈ రంగు వేస్తారు.
#3. ఆకు పచ్చ రంగు:
గరీబ్ రథ్ రైళ్ళకి ఆకుపచ్చ రంగు ఉంటుంది. ఈ రైళ్లు మీటర్ గేజ్ రైళ్ళకి సంబంధించినవి. చూశారు కదా ఏ రైళ్లకి ఎటువంటి రంగుని ఉపయోగిస్తారు అనేది. అంతే కానీ రైళ్ళకి వేరు వేరు రంగులు అందం కోసం వెయ్యరు.
#4. డయాగ్నల్ పసుపు రంగు స్ట్రైప్స్:
Ads
రైలుకి డయాగ్నల్ గా పసుపు రంగు స్ట్రైప్స్ ఉన్నట్లయితే ఇది జనరల్ బోగీ. ఎక్కడ జనరల్ బోగీ అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ ఈ స్ట్రైప్స్ ని చూస్తే మనం ఇది జనరల్ భోగి అని గుర్తు పట్టవచ్చు. కొన్ని కొన్ని సార్లు రైలు కోచ్ మీద నీలం రంగు లేదా తెలుపు రంగు స్ట్రైప్స్ కూడా ఉంటాయి ఇది కూడా రిజర్వేషన్ లేని భోగి అని అర్థం.
#5. ఆకుపచ్చ స్ట్రైప్స్:
EMU/DEMU రైళ్ల మీద ఆకుపచ్చ స్ట్రైప్స్ ఉంటాయి దీనికి అర్థం ఇదే మహిళా కంపార్ట్మెంట్ అని.
#6. LHB డబల్ డెక్కర్:
LHB డబల్ డెక్కర్ రైళ్ళకి పసుపు, ఎరుపు రెండు రంగులు కూడా ఉంటాయి.
#7. LHB దురోన్తో:
ఒక సింగిల్ కలర్ లో ఉండదు. వివిధ రంగులు ఉంటాయి ఈ కోచ్లకి.
#8. LHB హుంసఫర్ ఎక్సప్రెస్:
దురోన్తో కోచ్లకి ఉన్నతే LHB హుంసఫర్ ఎక్సప్రెస్ కి ఉంటుంది. కానీ ఈ రెండు రైళ్ళకి మధ్య కొన్ని చిన్న చిన్న తేడాలు ఉంటాయి.
#9. LHB తేజస్ ఎక్సప్రెస్స్:
LHB చైర్ కార్స్ లాగే LHB తేజస్ ఎక్సప్రెస్స్ కూడా ఉంటాయి. కానీ కొన్ని సదుపాయాలు ఎక్కువగా తేజస్ ఎక్సప్రెస్స్ కి ఉంటాయి.
#10. LHB గతిమాన్:
చూడడానికి ఇది ఏసీ చైర్ కార్ లాగే ఉంటుంది. కానీ ఈ కోచ్లకి చూస్తే కిందన పసుపు రంగు లో గీతాలు ఉంటాయి.
#11. LHB అంత్యోదయ ఎక్సప్రెస్స్:
ఇవి మోడరన్ LHB కోచ్లు. ఇవన్నీ కూడా పూర్తిగా రిసర్వ్ కానివి. ప్రతీ కంపార్ట్మెంట్ కూడా మంచి సదుపాయాలు వున్నాయ్.