కవిత గురించి వేణు స్వామి ముందే చెప్పారా..? ఏం అన్నారంటే..?

Ads

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న అరెస్ట్ అయ్యారు. దాంతో ఎన్నికలకు ముందు పార్టీకి ఊహించనటువంటి సంఘటన జరిగింది. నిన్న ఈడీ అధికారులు కవితని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ లో ఉన్న కవిత ఇంట్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. సోదా చేసిన తర్వాత ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కవిత ఫోన్లన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. కవిత వెళుతూ వెళుతూ తన కొడుకుకి ముద్దు పెట్టి వెళ్లడం, ఈ దృశ్యం చూసిన వారందరినీ కూడా కంటతడికి గురి చేసింది.

venu swamy about kavitha prediction

ఈ క్రమంలో కవిత అరెస్ట్ అవ్వడంతో, బీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలా హఠాత్తుగా సోదాలు జరిపి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పారు. అయితే, గతంలో వేణు స్వామి కవితకి సంబంధించి చేసిన కామెంట్స్ కొన్ని ఇప్పుడు బయటికి వచ్చాయి. వేణు స్వామి చాలా మంది సెలబ్రిటీల గురించి, వారి భవిష్యత్తు గురించి చెప్తూ ఉంటారు. ఆయన చెప్పినవి చాలా వరకు జరిగాయి.

venu swamy about kavitha prediction

సమంత, నాగ చైతన్య పెళ్లి తర్వాత వారి జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని వేణు స్వామి చెప్పారు. అయితే, ఆయన చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆయన చెప్పినట్టే తర్వాత అవ్వడంతో వేణు స్వామి ఇంటర్వ్యూలు వెలుగులోకి రావడం మొదలు అయ్యాయి. అక్కినేని అఖిల్ గురించి కూడా వేణు స్వామి ముందే చెప్పారు. ప్రభాస్ గురించి పలు ఇంటర్వ్యూలలో వేణు స్వామి మాట్లాడారు.

Ads

సినిమా సెలబ్రిటీల గురించి మాత్రమే కాకుండా రాజకీయానికి సంబంధించిన వ్యక్తుల గురించి కూడా వేణు స్వామి మాట్లాడుతూ ఉంటారు. ఇదే విధంగా కవిత గురించి కూడా వేణు స్వామి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “కవిత జాతకంలో జైలుకి వెళ్లే యోగం ఉంది” అని చెప్పారు. కాకపోతే అది ఏ కేసులో అనేది చెప్పడం కష్టం కానీ, కవిత మాత్రం జైలుకు వెళ్తారు అని అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో 2023 లో కేసీఆర్ ఓడిపోతారు అని కూడా చెప్పారు. దాంతో అప్పుడు వేణు స్వామి చెప్పినట్టే ఇప్పుడు జరిగింది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

watch video :

ALSO READ : శనివారం రోజు నాన్-వెజ్ తినకూడదు అని ఎందుకు అంటారు..? కారణం ఏంటంటే..?

Previous articleరైలు కోచ్లకి ఎందుకు ఈ రంగులు వేస్తారు.. కారణం ఏమిటో తెలుసా…?
Next articleకీబోర్డ్ మీద ఎందుకు అక్షరాలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉండవు.. కారణం ఇదే..!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.