Ads
హరహర వీరమల్లు సినిమా తో పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. ఇలాంటి సినిమా ని ఫస్ట్ టైం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా ని తెర మీదకి తీసుకు వస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ని క్రిష్ జాగర్లమూడి తీసుకు వచ్చాడు. ఆ సినిమా కి మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది. ఇక హరహర వీరమల్లు ఎవరు..? ఈ సందేహం మీలో కూడా ఉందా..?
ఇక హరహర వీరమల్లు ఎవరు, ఆయన చరిత్ర గురించి చూద్దాం. భారత దేశం మీదకు పలు రాజ్యాల వాళ్ళు క్రీస్తు శకం 11 వ శతాబ్ద కాలం లో దండెత్తి వచ్చేవారు.
దానికి కారణం మన సంపదని తీసుకు వెళ్ళడానికే. అలానే ఇస్లాం మతం ని ఇక్కడకి తీసుకు రావాలని మన భారత దేశంలోకి మహమ్మదీయులు చొరబడ్డారు. 13 శతాబ్దం కి దేశంలో చాలా దాకా వాళ్ళ ఆధీనం లోకి వచ్చింది. మన దేశం అప్పుడు హిందూ రాజుల చేతుల్లో ఉండేది. యాదవుల దేవగిరి, కాకతీయుల వరంగల్, హౌసల ద్వారా సముద్రం ఇలా ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు. అయితే అప్పటి దాకా పరవాలేదు కానీ ఢిల్లీ లో మహ్మద్ తుగ్లక్ పాలన మొదలు పెట్టక పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది.
Ads
ఆ సమయం లో కాకతీయుల సంస్థానం లో హరిహర మరియు అతని తమ్ముడు బుక్క కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని వద్ద కోశాధికారిగా వుండేవాళ్ళు. ఆ తరవాత కంపిలి వెళ్లి.. కంపిలి దేవ వద్ద సహాయకులుగా వున్నారు. 1326 లో కంపిలి ని జయించినప్పుడు బందీలు కింద వీళ్ళని ఢిల్లీ తీసుకెళ్లారు. వీళ్ళు ఇస్లాం మతానికి మారవలసి వచ్చింది. తర్వాత సుల్తాన్ ఆదేశం తో కంపిలి ని స్వాధీనం చేసున్నారు. శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావంతో హిందూ మతం తీసుకున్నారు. తరవాత విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. మొదట హరహర తుంగభద్ర నదీ ప్రాంతాన్ని ఆధీనంలోకి తెచ్చుకుని… తరవాత మలబార్ తీరం, కొంకణ్ తీరం కూడా పొందారు.
హోసల రాజ్యాన్ని కూడా వీర హరి హరుడు ఆక్రమించాడు. 1346 కాలంలో శృంగేరి శాసనంలో రెండు సముద్రాల మధ్యభాగానికి రాజు మన హరిహరుడు. విద్యానగరమే అతని రాజధాని. వీళ్లది సంగమ రాజ వంశం. నలుగురు సోదరులు హరిహరుడుకి వున్నారు. వాళ్ళే కంపన్న, బుక్క, మరప్ప, మడప్ప. విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించడానికి వీళ్ళే సహాయం చేసారు.