దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలు రిజెక్ట్ చేసిన 8 మంది నటీనటులు ఎవరో తెలుసా?

Ads

దర్శక ధీరుడు రాజమౌళి అంటే టాలీవుడ్ లో తెలియని వారు ఉండరు.బాహుబలి, RRR సినిమాలతో ఆయన ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న దర్శకులలో టాప్ ప్లేస్ లో ఉన్నాడు.

Ads

ఇక అలాంటి డైరెక్టర్ సినిమా మొదలుపెడుతున్నాడంటే ఆయన సినిమాలో అవకాశాల కోసం ఎంతోమంది యాక్టర్స్ చూస్తుంటారు. రాజమౌళి సినిమాల్లో ఒక చిన్న పాత్ర వచ్చిన వదులుకోరు. అంతటి దర్శక ధీరుడు రాజమౌళి పిలిచి అవకాశం ఇస్తే రిజెక్ట్ చేసినవారు ఉన్నారు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజం. అలా జక్కన్నను రిజెక్ట్ చేసిన నటీనటులు ఎవరో చూద్దాం..బాలకృష్ణ-మగధీర
తెలుగు సినిపరిశ్రమలో అగ్రనటుడు బాలకృష్ణ అంటే తెలియని వారు ఉండరు.ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. జక్కన్నమొదట బాలయ్యకు మగధీర స్టోరీని చెప్పారంట. కానీ బాలకృష్ణ ఏవో కారణాలు చెప్పి రిజెక్టు చేశారంట.ప్రభాస్- సింహాద్రి
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ రాజమౌళి సినిమాల వల్లే ఈ స్థాయికి వచ్చారు. కానీ సింహాద్రి కథ ఎన్టీఆర్ కన్నా ముందుగా ప్రభాస్ ని అడిగారట. ఆ కథ నాకు సెట్ అవదని చెప్పి రిజెక్టు చేశారంట.పవన్ కళ్యాణ్- విక్రమార్కుడు
రవితేజ విక్రమార్కుడు మూవీ ద్వారా ఎంతటి ఘన విజయన్ని అందుకున్నారో అందరికి తెలుసు. అయితే ఈ సినిమా ముందుగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి, ఆయన డేట్స్ సెట్ అవ్వక రిజెక్ట్ చేశారు.కాజల్ -యమదొంగ
ఎన్టీఆర్ నటించిన యమదొంగ మూవీ సూపర్ హిట్ అయ్యింది. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా కాజల్ ను అడిగారంట. కానీ ఆమె డేట్స్ ఖాళీ లేక ఒప్పుకోలేదట.అమితాబ్ – బాహుబలి
బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రకు ముందుగా అమితాబచ్చన్ ని సంప్రదించారంట. కానీ ఆయన ఏవో కారణాలు చెప్పి రిజెక్ట్ చేశారు.శ్రీదేవి-బాహుబలి
బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఎంతటి ఆదరణ దక్కిందో అందరికి తెలుసిన విషయమే. అలాంటి పాత్ర ముందుగా హీరోయిన్ శ్రీదేవిని అడిగారంట, ఆమె రిజెక్ట్ చేయడంతో అదృష్టం రమ్యకృష్ణ కు దక్కింది.జాన్ అబ్రహం – బాహుబలి
బాహుబలి సినిమాలో బల్లాలదేవుని పాత్ర కోసం జాన్ అబ్రహంను తీసుకోవాలనుకుంటే, ఆయన రిజెక్ట్ చేశారట.శ్రద్ధా కపూర్-ఆర్ఆర్ఆర్
జక్కన్న దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీలో ఒలీవియా మోరిస్ చేసిన జెన్ని కోసం ముందు బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ను అడిగితే, ఆమె రిజెక్ట్ చేసిందట.

Also Read: ఖుషి VS న‌ర‌సింహానాయుడు.. బాక్సాఫీసును షేక్ చేసిన సినిమా ఏది?

Previous article1964 లో “అంబాసిడర్ కారు” ధర ఎంతో తెలుసా.? అప్పటి ఈ బిల్ ఒక లుక్ వేయండి.!
Next article”హరిహర వీర మల్లు” ఎవరు..? ఆయన గొప్పతనం ఏమిటో తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.