Ads
సాధారణంగా ఒక సినిమాకి ఒక రచయిత దర్శకుడు కోరిన విధంగా కథలు రాస్తే, ఆ స్టోరీకి హీరోగా ఇంకొకరు ఉండేవారు. ఈమధ్యకాలంలో ఇండస్ట్రీలో పరిస్థితులు కూడా మారడంతో హీరోలు దర్శకులుగాను, రచయితలుగాను, నిర్మాతలుగా మారిపోతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.
Ads
ఒకప్పుడు రచయితలు అనగానే సత్యానంద్, పరుచూరి బ్రదర్స్, జంధ్యాల వంటి ప్రముఖ రచయితలు గుర్తుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలు రచయితలుగా మారడం కొత్త ట్రెండ్ అని చెప్పాలి. అలా ప్రస్తుతం యంగ్ హీరోలే రచయితలుగా మారి తమ సినిమాలకు తామే కథలను రాసుకుంటూ విజయాలను పొందుతున్నారు. మరి అలా రచయితలుగా చేస్తూ, హీరోలుగా కొనసాగుతున్నవారు ఎవరో ఇప్పుడు చూద్దాం..
అడవి శేషు:
ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న యంగ్ హీరో అడవి శేషు. ఆయన ‘క్షణం’ సినిమా నుండి మేజర్ వరకు నాలుగు సినిమాలకు తానే రచయితగా పనిచేశాడు. రచయితగానే కాకుండా హీరోగా కూడా ఆ నాలుగు సినిమాల ద్వారా సూపర్ హిట్లు అందుకున్నాడు. అంతేకాకుండా అడవి శేషు దర్శకుడుగా కూడా ప్రయోగాలు చేస్తున్నాడు.
విశ్వక్ సేన్:
ఈ లిస్టులో తరువాత చెప్పుకోవాల్సిన హీరో విశ్వక్ సేన్. అతడు హీరోగా నటించిన ‘ఫలక్ నామాదాస్’ సినిమాకి స్టోరీ అందించాడు. ఆ తరువాత విశ్వక్ సేన్ నటించిన చిత్రాల కథల విషయంలో ఆయన హస్తం ఉందని అంటారు.
నవీన్ పోలిశెట్టి
నవీన్ పొలిశెట్టి ఒకవైపు హీరోగా సినిమాలలో నటిస్తూనే మరోవైపు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఆయన హీరోగా నటించిన ‘జాతిరత్నాలు’ చిత్ర కథ మరియు స్క్రిప్ట్ విషయంలో అతను కూడా భాగం అయ్యారని సమాచారం.
కిరణ్ అబ్బవరం:
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగు పెట్టి మరో హీరో కిరణ్ అబ్బవరం. తానే రచయితగా మారి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఆ మూవీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
సిద్దు జొన్నల గడ్డ:
ఈ యంగ్ హీరో కృష్ణ అండ్ హిస్ లీల సినిమాకు కథ మరియు స్క్రీన్ ప్లే అందించారు.Also Read: అడివి శేష్ సొంతంగా కథలు ఎందుకు రాసుకుంటున్నాడో తెలుసా?