చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ ట్రైలర్ లో ఉన్నా మైనస్ లు ఇవే..!

Ads

సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాతో సంక్రాంతికి రాబోతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ రవి తేజ కాంబినేషన్ లో తెర మీదకి రాబోతోంది.

శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు అలానే కేథరిన్ థెరెసా కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తీసుకు వస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతము అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు ఈ సినిమా ట్రైలర్ అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది.

Ads

ఈ సినిమా పాటలకి చక్కటి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ గా కూడా మారాయి. ఇప్పటికే 10 మిలియన్  వ్యూస్ వచ్చాయంటే మామూలు విషయం కాదు కదా..? అయితే తాజాగా ట్రైలర్ కూడా వచ్చేసింది. ఈ ట్రైలర్ లో కొన్ని మైనస్లు ఉన్నాయని టాక్ వస్తోంది. మరి ట్రైలర్ లో ఉన్న మైనస్లు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

  • డైలాగులు ఎక్కువగా వున్నాయి. అలానే అవి ఫాస్ట్ గా వున్నాయి. దీనితో ఓవర్ గా వుంది.
  • యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉండడంతో మూవీ కాన్సెప్ట్ ఏమిటి అనేది తెలీలేదు. కన్ఫ్యూజ్ చేసేసారు యాక్షన్ పార్ట్ తో.

  • వి.ఎఫ్.ఎక్స్ అనేది చాలా వీక్ గా వుంది ట్రైలర్ లో. ఈ కారణంగా గానే పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వేశారు.
  • క్యాస్టింగ్ ఎక్కువ ఉండటం వలన ఫాస్ట్ ఫార్వార్డ్ లో చూసినట్టు వుంది.
  • రవి తేజ ముంది చిరు తేలిపోయినట్టు వున్నాడు. చిరు కి మ్యాకప్ బాగా హెవీగా వేసేసారు. మరి ట్రైలర్ ని చూసి సినిమా ని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. సినిమా వచ్చే వరకు ఆగుదాం.
Previous articleఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసినపుడు నకిలీ నోట్లు వస్తే ఏం చేయాలంటే..
Next articleతమ సినిమాలకు తామే కథలు రాసుకుని హిట్లు అందుకున్న ఈ 5 గురు హీరోలు ఎవరో తెలుసా?