Ads
కరోనా మహమ్మారి కారణంగా వచ్చిన లాక్ డౌన్ సమయంలో చాలా మంది ప్రతిభ బయటపడిందని చెప్పాలి. జీవితంలో కనీసం ఒక్కసారైనా గరిటె పట్టుకోవడం ఎరుగని వారు కూడా వంటల్లో ఆరితేరారు. ఎంతోమంది వారి అభిరుచులకు తగ్గట్టుగా వారి టాలెంట్ ను వెలికితీసే ఛాన్స్ లాక్ డౌన్ ద్వారా దొరికింది.
Ads
ఏ జాబ్ లేని వారు ఉద్యోగం పొందారు. మరికొందరు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యారు. ఇలా ఎవరి పరిధి మేరకు వారు తమ టాలెంట్ లోకానికి పరిచయం చేయాడమే కాకుండా ప్రస్తుతం లక్షల్లో సంపాధిస్తున్నారు. టెక్నాలజీని వాడుకుని లాక్ డౌన్ లో చాలా మంది తమ జీవితాలను సరికొత్తగా మార్చుకున్నారు. లాక్ డౌన్ లో సమయంలో ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఖాళీగా ఉండే కన్నా కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలని యూట్యూబ్ లో చూసి కోర్సులు నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అలాంటి వారిలో ఏపీలోని గుంటూరుకి చెందిన రావూరి పూజిత కూడా ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో యూట్యూబ్ లో చూసి ఒక కోర్స్ నేర్చుకుని, గూగుల్ లో అరవై లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించుకుంది.
పూజిత ఇంటర్ పూర్తి చేసింది. ఆ తరువాత ఆమెకు ఝార్ఖండ్ బిట్స్ లో జేఈఈలో సీటు వచ్చింది. అయితే ఆమె తల్లిదండ్రులు అంత దూరం పంపించక పోవడంతో అదే ఊరులో కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ లో జాయిన్ అయ్యింది. ఫస్ట్ ఇయర్ లో రెండో సెమిస్టర్ అయిపోయే సమయానికి కరోనా వల్ల లాక్ డౌన్ పెట్టారు. ఆ సమయంలో పూజిత ఇంటికే పరిమితం కావలసి వచ్చింది. అయితే ఆన్ లైన్ క్లాసులు వినేది.
ఇక ఆన్ లైన్ క్లాసులు అర్థం కానపుడు యూట్యూబ్ లో చూసి తెలుసుకునేది. ఆమె అలా యూట్యూబ్ లో వీడియోల చూడడం ద్వారా కోడింగ్ నేర్చుకుంది. ఇక ఏ సాఫ్ట్ వేర్ కంపెనీలు కోడింగ్ కి రిలేటెడ్ గానే అడుగుతారు. దాంతో ఆమె కోడింగ్ లో నాలెడ్జ్ కోసం చాలా వెబ్ సైట్లని చూసేది. ఆన్ లైన్ అసెస్మెంట్లు, టైమ్ మేనేజ్మెంట్, ఇంటర్వ్యూల కోసం సాధన చేస్తూనే ఉండేది. అవే తనకు ఇంటర్వ్యూలో బాగా ఉపయోగపడ్డాయని పూజిత తెలిపింది. గూగుల్ రూ. 60 లక్షల వార్షిక ప్యాకేజీ ఆఫర్ చేశారని, ఇంటర్న్ షిప్ కు త్వరలోనే వెళ్తున్నానని పూజిత తెలిపింది.
Also Read: మేనరికపు పెళ్లి గురించిన నిజాలు ఏమిటో తెలుసా?