అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా గుర్తుందా! ఇప్పుడు ఎలాంటి దీనస్థితిలో ఉందో తెలుసా?

Ads

సినిమా రంగం అనేది ఒక గ్లామర్ లోకం. ఇక్కడ గ్లామర్ ఉన్నన్ని రోజుల వరకే అవకాశాలు ఉంటాయి. అలా అవకాశాలు వచ్చినప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకో గలాగాలి. లేదంటే అవకాశాలు లేని సమయంలో జీవితం ఎలా మారుతుందనేది ఎవరికి తెలియదు. అలా ఒకప్పడు స్టార్ హీరోయిన్లుగా వెలిగినవారు ప్రస్తుతం చీకటిమయంగా మారడం చూస్తూనే ఉన్నాం.

Ads

చేతిలో డబ్బులేక, తినడానికి కూడా తిండి కూడా దొరక్క సబ్బులు అమ్ముకుంటూనో కనిపిస్తున్నారు. ఒకప్పుడు అన్ని చూసినవారు ఇప్పుడున్న వారి దీనస్థితి గురించి తెలిస్తే, ఎవరికైనా కళ్ళు చెమర్చకుండా ఉండలేరు. అయితే తాజాగా మరో సీనియర్ నటి రోడ్డు మీద ఒక జర్నలిస్ట్ కి కనిపించింది.
అయితే ఆమె మరెవరో కాదు పాకీజా(వాసుకి). అయితే పాకీజా పేరు ఇప్పటితారం వారికి పెద్దగా తెలియదు. కానీ, 1980-90 ల సినీ ప్రేక్షకులకి బాగా సుపరిచితమైన పేరు. మోహన్ బాబు హీరోగా నటించిన ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రంలో స్టైలిష్ గా బాత్రూమ్ లు కడిగే క్యారెక్టర్ లో బ్రహ్మనందంను బోల్తా కొట్టించిన బ్యూటీగా పాకీజా నటన అందరిని ఆకట్టుకుంది. ఆ తరువాత పెదరాయుడు మూవీలోనూ పాకీజా పాత్రలోనే నటించింది.
తెలుగులోనే కాకుండా తమిళ సినిమాలలో కూడా ఎన్నో పాత్రలు చేసి ఆడియెన్స్ ని అలరించింది. తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో కలిపి ఎన్నో వందల చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న పాకీజా ప్రస్తుతం తిండిలేక ఇబ్బంది పడుతుంది. నమ్మలేని విషయం అయినా ఇదే వాస్తవం. నటి పాకీజా చాలా సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా బ్రతుకుతోంది. ఒక జర్నలిస్ట్ గుర్తుపట్టి, మాట్లాడడంతో తన జీవితం గురించి చెప్పుకొచ్చింది.
ఆమె లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నప్పటికి, ఆర్ధికంగా మాత్రం వెనకేసుకోలేదంట. అయితే ఆమెకు షుగర్ వ్యాధి రావడంతో సినిమాలకు దూరమైందని, కొన్నాళ్లుగా ఆర్థిక పరిస్థితి బాలేదు. సహాయం కోసం తమిళ నడిగర్ సంఘాన్ని, హీరోలను కలిశాను. చివరికి సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి కూడా నా స్థితి గురించి చెప్పాను. ఎవరూ సహాయం చేయలేదని, హాస్టల్ లో ఉంటున్నాను. సహాయం కోసం ఎదురు చూస్తున్నానని కంటతడి పెట్టుకుంది. ప్రేక్షకులు నటి పాకీజాను ఈ పరిస్థితిలో చూసి షాక్ అవుతున్నారు.
Also Read: దళపతి విజయ్ “వారసుడు” మూవీ రివ్యూ & రేటింగ్‌

Previous articleయూట్యూబ్ వీడియోల ద్వారా 60 లక్షల ప్యాకేజీతో గూగుల్ లో జాబ్ కొట్టిన గుంటూరు యువతి..
Next articleఅందం తగ్గిందంటూ కామెంట్ చేసిన నెటిజెన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సమంత..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.