Ads
ఇండస్ట్రీలో స్థిర పడడం అంత ఈజీ కాదు. ఎంతో కష్ట పడితే కానీ సక్సెస్ అవ్వలేము. ఇదిలా ఉంటే చాలా మంది నటులు నటులనే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మహేష్ బాబు నమ్రత ఇద్దరూ కూడా యాక్టర్స్ ఏ. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇలా చాలా మంది నటులు పెళ్లి చేసుకోవడాన్ని మనం చూస్తూ ఉంటాం.
రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకోవడంతో పాటు రీల్ లైఫ్ లో కూడా కలిసి నటించారు. మరి ఇటు రీల్ గా అటు రీయల్ గా కూడా పెళ్లి చేసుకున్న ఆ నటులుగా గురించి ఇప్పుడు చూద్దాం.
#1. రాజ శేఖర్, జీవిత:
1991లో రాజ శేఖర్, జీవిత పెళ్లి చేసుకున్నారు. తలంబ్రాలు సినిమాలో విలన్ గా రాజ శేఖర్ నటించిన విషయం తెలిసిందే. ఆయితే ఆ సినిమాలో జీవితని వివాహం చేసుకుంటాడు రాజ శేఖర్.
#2. కృష్ణ, విజయ నిర్మల:
కృష్ణ, విజయ నిర్మల కలిసి సాక్షి సినిమా చేసారు. ఆయితే అప్పటికే ఇద్దరు పెళ్లిళ్లు అయ్యిపోయాయి. అయినా వీళ్ళు పెళ్లి చేసుకున్నారు.
#3. నాగార్జున, అమల:
శివ సినిమాలో నాగార్జున, అమల జంటగా నటించారు. తరవాత రీయల్ గా కూడా నాగార్జున, అమల ఒకటయ్యారు.
Ads
#4. శ్రీకాంత్, ఊహ:
శ్రీకాంత్ తో కలిసి పలు సినిమాలలో నటించింది ఊహ. తరవాత శ్రీకాంత్, ఊహ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.
Also Read: వెంకటేష్ హీరోగా.. సురేష్ బాబు ప్రొడ్యూసర్ గా ఎందుకు స్థిరపడ్డారు..?
#5. మహేశ్ బాబు, నమ్రత:
వంశీ సినిమా చేసాక వీరి మధ్య ప్రేమ మొదలైంది. ఐదేళ్ల లవ్ తర్వాత ఈ జంట ఒకటయ్యారు.
#6. వరుణ్ సందేశ్, వితికా శేరు:
పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో వరుణ్ సందేశ్, వితికా నటించారు. తరవాత వీళ్ళు ఏడడుగులు వేశారు.
#7. నాగచైతన్య, సమంత:
ఏం మాయ చేశావే సినిమాలో వీళ్ళు జంటగా నటించారు. కట్ చేస్తే బయట పెళ్లి చేసుకున్నారు. కానీ వీళ్ళు ఇప్పుడు విడిపోయారు.
#8. శివబాలజీ, మధుమిత:
ఇద్దరు సినిమాల్లో నటించారు. అలానే వీళ్ళు కూడా బయట పెళ్లి చేసుకున్నారు.
Also Read: ఉదయ్ కిరణ్ తో నటించిన ఈ 4 నటులు కూడా చనిపోయారు..!