Ads
రతన్ టాటా పరిచయం అవసరం లేని పేరు. దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న బిజినెస్ టైకూన్. పద్మ అవార్డుల గ్రహీత. అది మాత్రమే కాకుండా మానవత్వానికి, మంచితనంకు నిలువెత్తు నిదర్శం అని చెప్పవచ్చు. నైతిక విలువలు, నమ్మమైన నాయకత్వం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం ఆయన సొంతం. వేల కోట్ల ఆస్తులు ఉన్నా కూడా మామూలు జీవితాన్ని జీవిస్తున్న అసామన్యుడు రతన్ టాటా.
Ads
ఉప్పు దగ్గరి నుండి మొదలు పెడితే కార్లు, బంగారం, విమానం, ఐటీ వరకు ఎన్నో విభాగాల్లో వ్యాపారాలను చేస్తున్న ఆయనికి వ్యాపార ప్రపంచం సెల్యూట్ చేస్తుంది. ఇక టాటాల బిజినెస్ సామ్రాజ్యాన్ని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.
ఇక ఆయన నిత్యం వార్తల్లోనే ఉంటారు. వ్యాపార రంగానికి చెందిన విషయాలలో, లేదా ఆయన సోషల్ మీడియాలో పెట్టె పోస్టుల కారణంగా, ఇంకొన్నిసార్లు ఆయన చేసే స్వచ్ఛంద సేవలకు వచ్చే ప్రశంసల కారణంగా తరచుగా ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆయన ఒక పెట్ లవర్ అని అందరికి తెలిసిన విషయమే. ఆయన తన పెంపుడు కుక్కలతో గడిపిన ఫోటోలను చాలా సార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఆయన తన సోదరుడు మరియు పెట్ తో కలిసి ఉన్న ఒక పాత ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు “అవి ఆనందమయ రోజులు” అనే క్యాప్షన్ పెట్టారు. ఇది 78 సంవత్సరాల కిందటి ఫోటో. 1945లో తీసిన ఈ ఫోటోలో మైనర్లుగా ఉన్నప్పుడు రతన్ టాటా, తన తమ్ముడు జిమ్మీ టాటాతో తీసిన ఫోటో. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో చర్చకు దారి తీసింది. రతన్ టాటా తమ్ముడు జిమ్మీ నావల్ ఎవరు? ఆయన ఏమి చేస్తారు? ఎక్కడ ఉన్నారు ? అని నెటిజెన్లు చర్చిస్తున్నారు. అయితే జిమ్మీ నావల్ అజ్ఞాతంగా జీవిస్తున్నారు. ఆయన రతన్ టాటా కన్నా రెండు ఏళ్ళు చిన్నవాడు. ప్రస్తుతం ఆయన వయస్సు 82 ఏళ్ళు. ఆయన ముంబైలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. ఇక ఆయన ఇంట్లో టీవీ, మొబైల్ ఫోన్ లాంటివి ఏమి లేవు. జిమ్మీ నావల్ టాటా తండ్రి నావల్ టాటా నిజానికి టాటా కుటుంబం సభ్యుడు కాదు. ఆయనని జమ్షెట్జీ టాటా దత్తత తీసుకున్నారని తెలుస్తోంది. ఇక తండ్రి నావల్ టాటా ఆధ్వర్యంలో జిమ్మీ నావల్ అనేక టాటా కంపెనీలలో పనిచేశారు. ఇక 90 లలో రిటైర్ అయ్యారు. అప్పటి నుండి జిమ్మీ నావల్ టాటా ఒక చిన్న ఇంట్లో సామాన్యుడిలా గడుపుతున్నాడు. జిమ్మీ నావల్ కూడా రతన్ టాటా లాగానే బ్రహ్మచారి.
Also Read: ఊర్లో మనుషులు ఉండాలి కానీ… మనిషిలా ఉందేంటి ఈ ఊరు..!