ఊర్లో మనుషులు ఉండాలి కానీ… మనిషిలా ఉందేంటి ఈ ఊరు..!

Ads

ఊరు అంటే ఎలా ఉంటుంది..? చెట్ల తో అందమైన ప్రకృతి తో పల్లెల్లో ఉంటాయి అదే పట్నం అయితే భవనాలు, పెద్ద పెద్ద మేడలు, అపార్ట్మెంట్లు ఉంటాయి. ఊరు ఆకారం ఎలా ఉంటుంది..? అక్కడ ఉండే నేలని బట్టి గుండ్రంగా కానీ లేదంటే మరో రకంగా కానీ ఉండొచ్చు. ఊర్లో మనుషులు ఉంటారు .కానీ ఎప్పుడైనా మీరు ఇలాంటి ఊరని చూసారా…? ఈ ఊరు మనిషి ఆకారం లోనే ఉంటుంది.

మనుషులు ఊర్లో ఉంటారు కానీ మనిషి ఆకారంలో ఊరు ఉంటుందా అని ఆలోచిస్తున్నారా..? ఈ ఊరు ఉందండి. ఈ ఊరు చూడడానికి మనిషి ఆకారంలోనే ఉంటుంది.

Ads

మరి ఈ ఊరు ఎక్కడుంది..? ఎందుకలా ఉంటుంది అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇటలీలోని సెంటూరిపే అనేది ఓ చిన్న పట్టణం. ఈ ఊరు చూడడానికి సేమ్ మనిషి లాగ ఉంటుంది. స్థానిక ఫొటోగ్రాఫర్‌ పియో ఆండ్రియా పెరి ఇది నిజమేనా అనేది చెక్ చేసారు కూడా. గూగుల్‌ ఎర్త్‌ లో సిటీ ని చూస్తూ ఉంటే ఇది చూడడానికి మనిషి ఆకారం లో ఉండేది అని సందేహం వచ్చింది. అప్పుడు ఆ సందేహాన్ని తీర్చుకోవాలని ఫోటో తీశారు.

స్థానిక ఫొటోగ్రాఫర్‌ పియో ఆండ్రియా పెరి డ్రోన్‌ సాయం తో పలు చిత్రాలను తీయగా అవి చూస్తే సేమ్ ఇలానే వున్నాయి. దానితో అతని డౌట్ క్లియర్ అయిపోయింది. తాను తీసిన పిక్ ని చూసి చాలా మంది నమ్మలేదు. కానీ గూగుల్ లో చూసాక మళ్ళీ నమ్మారు. ఇక్కడ 5 వేల మంది జనాభా వుంటారు. ఈ ఊరు సముద్ర మట్టానికి 2,400 అడుగుల ఎత్తు లో ఉంది. ఈ పిక్ ని చూస్తే ఎవరైనా మార్ఫింగ్ చేశారేమో అని అనుకుంటారు కానీ ఇది నిజమే ఈ ఊరే మనిషి ఆకారం లో ఉంది.

Previous article“గోదావరి” సినిమా ముద్దుగుమ్మ “కమిలినీ ముఖర్జీ” గుర్తుందా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?
Next articleAgent movie review: అఖిల్ అక్కినేని ”ఏజెంట్” సినిమా హిట్టా..? ఫట్టా..?