Ads
సాధారణంగా సినిమాలలో మంచి క్యారెక్టర్స్ రావడం అనేది అంత తేలిక కాదు. ఒకవేళ అలాంటి అవకాశం వచ్చినప్పుడు మిస్ చేసుకుంటే వాళ్ళు గోల్డెన్ ఛాన్స్ ను వదిలేసుకున్నట్టే అవుతుంది. ఇక అలా తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది హీరోయిన్స్ వాళ్ళను వెతుక్కుంటూ వచ్చిన మంచి పాత్రలను మిస్ చేసుకున్నారు. మరి ఆ హిరోయిన్స్ ఎవరో చూద్దాం..
1. నిజం- జయసుధ:
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘నిజం’ మూవిలో ఆయన తల్లి పాత్రకి ముందుగా జయసిధ గారిని అడిగాడు డైరెక్టర్ తేజ. అయితే ఆ పాత్ర పవర్‌ఫుల్ రోల్ కావడంతో జయసుధ రిజెక్ట్ చేసారు.2. నరసింహ-మీనా:
సూపర్ స్టార్ రజినీకాంత్ నరసింహ మూవీలోని ఐకానిక్ క్యారెక్టర్ నీలాంబరికి రమ్యకృష్ణ ఫస్ట్ ఛాయిస్ కాదు. డైరెక్టర్ కెఎస్ రవికుమార్ ముందుగా హీరోయిన్ మీనాని అనుకున్నారు. ఆమె రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రలో రమ్యకృష్ణని తీసుకున్నారు.3. శ్రీమంతుడు-జయప్రద:
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు మూవీలో మహేష్ తల్లిగా సుకన్యచేసిన పాత్రకి ముందుగా జయప్రదని అడిగారంట. అయితే ఆమె రిజెక్ట్ చేయడంతో సుకన్యను ఎంపిక చేసారు.4. బాహుబలి-శ్రీదేవి:
జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ శివగామికి శ్రీదేవిని ఎంపిక చేశారు. అంత ఒకే అయ్యాక, రెమ్యునరేషన్ కారణంగా శ్రీదేవి రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రలో రమ్యకృష్ణని తీసుకున్నారు.5. రంగస్థలం-రాశి:
సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం మూవీలోని రంగమత్త పాత్ర హీరోయిన్ రాశిని అనుకున్నారంట. ఆమె రిజెక్ట్ చేయడంతో అనసూయను తీసుకున్నారు.6. రాజా ది గ్రేట్-విజయశాంతి:
అనిల్ రావిపూడి, రవితేజ కాంబోలో వచ్చిన రాజా ది గ్రేట్ చిత్రంలో రవితేజ తల్లి పాత్ర కోసం విజయశాంతిని అడిగారంట. ఆమె కొన్ని కారణాలవల్ల రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రలో అలనాటి హీరోయిన్ రాధకను తీసుకున్నారు.
Ads
7. శ్రీమంతుడు-గ్రేసీ సింగ్:
శ్రీమంతుడు సినిమాలో మహేష్ తల్లి పాత్ర కోసం జయప్రద గారు రిజెక్ట్ చేసిన తరువాత సంతోషం మూవీ హీరోయిన్ గ్రేసీ సింగ్ ని అనుకున్నారు. అయితే ఆమె కూడా ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసారు.8. చెన్నకేశవ రెడ్డి-లయ
చెన్నకేశవ రెడ్డి మూవీలో బాలకృష్ణ కి చెల్లలి పాత్రలో ముందుగా హీరోయిన్ లయని అనుకున్నాడు వివి వినాయక్. అయితే లయ అప్పటికే బాలయ్యతో హీరోయిన్ గా నటించింది. ఆ కారణంగా ఆమె రిజెక్ట్ చేయడంతో దేవయానిని తీసుకున్నారు.
Also Read: ఆ స్టార్ హీరోకి లవర్ గా, ప్రస్తుతం వదినగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?