ఆ స్టార్ హీరోకి లవర్ గా, ప్రస్తుతం వదినగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Ads

సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి ఛాన్స్ లు వస్తాయని చెప్పడం చాలా కష్టమైన విషయం. ఒక్క సినిమాతో స్టార్స్ కూడా కావచ్చు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే వాళ్ళ కెరీర్ తక్కువగా ఉంటుంది. తెలుగులో కెరిర్ ముగిసిందనుకున్న ఒక స్టార్ హీరోయిన్ వరుస అవకాశాలు పొందుతూ ముందుకెళ్తోంది.

ఆ హీరోయిన్ కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతిహాసన్. ప్రస్తుతం టాలీవుడ్ లో శృతిహాసన్ కు క్రేజ్ పీక్స్ లో ఉంది. శృతిహాసన్ లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినీపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన కూడా, తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన గుర్తింపును సంపాందించుకుంది. శృతిహాసన్ కి టర్నింగ్ పాయింట్ ఇచ్చిన సినిమా పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్. ఈ సినిమా తర్వాత వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. స్టార్ హీరోల సరసన వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది.

Ads

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణకు జోడీగా వీర సింహారెడ్డి సినిమా, మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య చిత్రాలలో శృతిహాసన్ నటిస్తోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ జంటగా సలార్ చిత్రంలో నటిస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో శృతిహాసన్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి వైరల్ గా మారింది.అదేమిటంటే ఆమె కెరీర్ మొదట్లో ఒక స్టార్ హీరోకు ప్రేయసిగా నటించింది. అయితే ప్రస్తుతం ఆ హీరోకే వదినగా నటిస్తుందంట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే మాస్ మహారాజా రవితేజ. శృతిహాసన్ రవితేజ సరసన బలుపు, క్రాక్ చిత్రాలలో నటించిన విషయం అందరికి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో శృతిహాసన్ హీరోయిన్, కీలకపాత్రలో రవితేజ నటిస్తున్నారు. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి, రవితేజ అన్నదమ్ములుగా నటిస్తున్నారని సమాచారం. అంటే శృతిహాసన్ రవితేజకి వదిన పాత్రలో కనిపించబోతునట్లు తెలుస్తుంది. అయితే ఇలా ఒకే హీరోకు ప్రేయసిగా, ఆ తరువాత ఆ హీరోకే వదినగా నటించిన కథానాయకలు పరిశ్రమలో ఎక్కువ మంది. శృతిహాసన్ కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయింది.

Also Read: సూపర్ స్టార్ రజినీకాంత్ వదులుకున్న తెలుగు సినిమా ఏమిటో తెలుసా?

Previous articleమందు కొట్టే ముందు ”చీర్స్” అని ఎందుకు చెప్తారు..? దాని వెనుక ఇంత పెద్ద రీజన్ ఆ…?
Next articleసినిమాలను వదిలి సన్యాసం తీసుకున్న 5 గురు బాలీవుడ్ నటినటులు వీరే..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.