Ads
మనం నిద్ర పోయినప్పుడు మన బాడీ ఎంతో రిలాక్స్ అవుతుంది. కాస్త ఒత్తిడిగా అనిపించినా లేదంటే అనారోగ్యంగా అనిపించినా కొంచెం సేపు నిద్రపోతే తిరిగి మళ్ళీ మన బాడీ సరిగ్గా పనిచేస్తుంది. ఇబ్బందుల నుండి బయటపడుతుంది. ప్రతి ఒక్క మనిషికి కూడా ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర ఎంతో ముఖ్యము. నిద్ర మనిషి ఆరోగ్యం పై ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే మనం నిద్రపోయినప్పుడు మనకి కొన్ని శబ్దాలు వినపడవు.
ఎప్పుడైనా మీకు ఈ సందేహం కలిగిందా..? నిద్రపోయినప్పుడు ఎందుకు మనకి అన్నీ వినపడవు అని.. దీనికి గల కారణం చెవులు పనిచేయకపోవడం కాదు.
మనం నిద్రపోయినప్పుడు చెవులు పనిచేయవు అని అనుకుంటే పొరపాటే. మనం నిద్రపోయినప్పుడు కూడా మన చెవులు పనిచేస్తాయి. చెవులు ద్వారా అది మైండ్ కి వెళుతుంది. అయితే మెదడు నిర్ణయం తీసుకుంటుంది మనం నిద్రలేవాలా లేదంటే నిద్ర పోవాలా అని.
Ads
ప్రతి చిన్న శబ్దం కూడా మనకి వినపడి అది మన మెదడుకి సమాచారం ఇస్తుంది. మన మెదడు నిర్ణయం తీసుకుంటుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు కొన్ని వాటిని పట్టించుకోవద్దు అని వదిలేయమని చెబుతుంది. అందుకనే మనకి కొన్ని శబ్దాలు కొన్ని ఆక్టివిటీస్ కొన్ని వాసనలు తెలియవు. మనం వాటిని గుర్తించగలుగుతాము కానీ పట్టించుకోకుండా వదిలేస్తాము. నిద్ర లేవకుండా వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాము.
సౌండ్స్ మనకి నిద్ర పోయినప్పుడు ఎందుకు వినపడవు..?
మన మెదడు ఫిల్టర్ లాగే పనిచేస్తుంది. మన బ్రెయిన్ కి చెవుల ద్వారా సిగ్నల్స్ వెళతాయి అయితే ఫిల్టర్ చేస్తుంది మన మెదడు. మన మెదడే నిర్ణయిస్తుంది నిద్ర పోవాలా నిద్రలేవాలా అని.. అందుకనే మనం నిద్ర పోయినప్పుడు కొన్ని మనకి వినపడవు.
మరి పెద్ద శబ్దాలకి ఎందుకు మనం షాక్ అవుతాము..?
నిద్ర పోయినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వంటివి వినపడితే మనం షాక్ అవుతూ ఉంటాము. అయితే మన బాడీ ఆక్టివ్ గానే ఉంటుంది కాబట్టి మనకి వినపడతాయి. ప్రమాదకరమైనవి, వార్నింగ్ సిగ్నల్స్ వంటివి వినపడినప్పుడు ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ మనం లేవాలని ఒత్తిడి చేస్తుంది. ఈ కారణంగా మనం లేచి నిర్ణయం తీసుకుంటాము. అయితే ఇది అందరికీ ఒకేలా పనిచేయదు. అందుకే కొంతమంది ప్రమాదకరమైనవి వినిపించినా సరే లేవ లేరు.