మళ్లీ వచ్చిన ముగ్గురు మగమహారాజులు..! ఈసారి ఏం ఉంది ఇందులో..?

Ads

ఏదైనా ఒక సినిమా వస్తే, అది చాలా పెద్ద హిట్ అయితే, దానికి సీక్వెల్ వస్తోంది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అయితే, వెబ్ సిరీస్ లో కూడా ఇలాగే జరుగుతుంది. మొదటి భాగం చాలా పెద్ద హిట్ అయితే, అందుకు కొనసాగింపుగా రెండో భాగం కూడా వస్తోంది.

అలా ఇటీవల తెలుగులో చాలా పెద్ద హిట్ అయిన ఒక సిరీస్ కి రెండవ భాగం ఇప్పుడు విడుదల అయ్యింది. ఈ సిరీస్ పేరు సేవ్ ద టైగర్స్. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ కి, అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు.

save the tigers disney plus hotstar review telugu

ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమటం, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని ముఖ్య పాత్రల్లో నటించారు. మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం ఈ సిరీస్ ని నిర్మించారు. ఇంకా ఈ సిరీస్ సీజన్ 2 ఇవాళ విడుదల అయ్యింది. దీని కథ విషయానికి వస్తే, మొదటి సీజన్ ముగించిన చోటే ఈ సీజన్ మొదలు పెట్టారు. ప్రముఖ హీరోయిన్ (హంసలేఖ) సీరత్ కపూర్ మిస్ అవుతుంది. ఆ తర్వాత తను ఎలా బయటికి వచ్చింది? వీళ్ళ ముగ్గురితో ఎలా స్నేహం చేసింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సిరీస్ చూడాల్సిందే.

Ads

save the tigers disney plus hotstar review telugu

మొదటి భాగంలో కామెడీ ఎక్కువగా ఉంటుంది. ముగ్గురు మగవాళ్ళు, వారి భార్యలు, వారికి పిల్లలు, కెరీర్ పరంగా, ఇంట్లో వ్యక్తుల పరంగా వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు. మొదటి భాగంలో ఇవన్నీ చూపించారు. ఇందులో కూడా ఎక్కువగా ఇవే ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లో ఉన్నట్టే ఇందులో కూడా కామెడీ ఎక్కువగా ఉండేలాగా చూసుకున్నారు. చాలా వరకు కామెడీ వర్క్ అవుట్ అయ్యింది. చాలా చోట్ల వీళ్ళు చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

save the tigers disney plus hotstar review telugu

దర్శకుడు ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా రాసుకున్నారు. ఇంక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే, నటీనటులు అందరూ కూడా వారి పాత్రలకి తగ్గట్టు చేశారు. ఈ సీజన్ లో కొన్ని కొత్త పాత్రలు కూడా వచ్చాయి. వాళ్లు కూడా చాలా బాగా చేశారు. ఫ్యామిలీ అందరూ కలిసి చూస్తే కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. పార్ట్ 1 చూసి అంచనాలు ఎక్కువగా పెట్టుకుంటే ఇది కూడా అస్సలు నిరాశపరచదు. కామెడీతో పాటు, కొన్ని సెన్సిటివ్ విషయాలని కూడా ఇందులో బాగా చూపించారు. అన్ని వర్గాల వయసు వారు ఎంటర్టైన్ అవుతారు.

Previous articleహిట్ టాక్ వచ్చినా కూడా… ఈ 4 సినిమాలు మాత్రం ప్లాప్ అయ్యాయి..!
Next articleమనం నిద్రపోయినప్పుడు మనకి శబ్దాలు ఎందుకు వినపడవు..? కారణం ఇదే..!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.