Ads
దక్షిణాది సినీ పరిశ్రమలో గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బాషా అనే సినిమా ద్వారా బీజం పడింది. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచి ఎన్నో చిత్రాలకు స్పూర్తిగా ఇచ్చిందని చెప్పవచ్చు.
ఇక ఆ తర్వాత భాషా స్ఫూర్తితో గ్యాంగ్‌స్టర్ స్టోరీతో చాలా సినిమాలు ఆడియెన్స్ ని అలరించాయి. తమిళంలో భాషా మూవీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి, అప్పట్లో రజనీకాంత్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా తెలుగులో విడుదల అయ్యి, సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు అప్పటి ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు.అంతగా ఆడియెన్స్ ని అలరించిన ఈ సినిమాను ఇద్దరు టాలీవుడ్ అగ్ర హీరోలతో తెలుగులో రీమేక్ చేయడానికి అప్పట్లో గట్టిగానే ప్రయత్నాలు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ వెర్షన్‌కు డైరెక్షన్ చేసిన సురేష్ కృష్ణ దర్శకుడిగా తెలుగులో రీమేక్ చేసేందుకు ఒక అగ్ర నిర్మాత ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే రజనీకాంత్ రేంజ్ లో బాషా క్యారెక్టర్‌ను వేరొకరు రీక్రియేట్ చేయడం చాలా కష్టం అని, ఇందులో నటించడానికి చిరంజీవి ఆసక్తి చూపలేదు.
ఆ తరువాత నందమూరి నట సింహం బాలకృష్ణ సంప్రదించగా ఆయన కూడా భాషా రీమేక్ లో నటించేందుకు నిరాకరించారని టాక్. దాంతో ఈ మూవీని రీమేక్ చేయడం కోసం పెద్ద హీరోలను ఆహ్వానించి, నిర్మాతలు దేవి శ్రీ థియేటర్లో భాషా సినిమా ప్రత్యేక షోను కూడా వేసారట. కానీ ఎందుకో ఈ మూవీ రీమేక్ లో నటించడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదంట.
Ads
తమిళ సినిమాని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. భాషా మూవీ తమిళంలో లాగానే తెలుగులో కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఆ తరువాత చిరంజీవికి సినిమా నచ్చడంతో అరవింద్ తెలుగు రైట్స్ కోసం తమిళ నిర్మాతను ఆడగగా అతను రూ.40లక్షలు చెప్పగా, అల్లు అరవింద్ రూ.25 లక్షలకే కావాలని అడిగారని, ఇక ఆ బేరం కుదరకపోవడం వల్లనే తెలుగు రీమేక్ చేయలేకపోయారని అంటారు. అయితే ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేసి ఉంటే చేసి ఆ సినిమా ఓ రేంజ్ విజయం పొంది ఉండేది.
Also Read: సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ హీరోయిన్స్ గా సక్సెస్ కానీ సెలబ్రిటీ డాటర్స్