జీవితంలో విజయం సాధించాలి అనుకున్నవారికి చాణిక్యుడు చెప్పిన నీతులు..

Ads

విజయంతో కూడుకున్నటువంటి సంపన్నమైన జీవితం జీవించాలి అనుకుంటే చాణిక్యుడు చెప్పిన ఈ సూక్తులను మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మనం జీవితంలో పురోగతి సాధించాలి అంటే జీవన ప్రమాణాలను మరియు మన వ్యక్తిగత సంబంధాలను ఎంతో మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. జీవితంలో ఉన్న ప్రతి అంశం అస్పష్టంగా ఉంటే మన జీవితం ముందంజ వేయదు. ఎప్పుడైతే మన జీవితం ఎంత సరళంగా ఉంటుందో మన సక్సెస్ కూడా అంత సులభంగా ఉంటుంది. మరి వాటి కోసం చాణిక్యుడు చెప్పిన సూక్తులు ఏమిటో చూద్దాం..

మొదటినుంచి ఎంతో ప్రశాంతమైన జీవితం గడిపిన వారు కూడా కొన్ని సమయాలలో అనుకోకుండా చిక్కుల్లో పడుతుంటారు. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఖర్చు పెట్టే మార్గం దాచిపెట్టే విధానం తెలియకపోతే కొండంత ధనం కూడా కరగడానికి ఎక్కువ సేపు పట్టదు. కాబట్టి అవసరాలు మీద ఖర్చు పెట్టడం.. భవిష్యత్తు కోసం దాచిపెట్టడం నేర్చుకోవలసిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది. ఎవరో సలహా ఇచ్చారు కదా అని కళ్ళు మూసుకొని ఏది పడితే అది నమ్మకూడదు.

chanakya-niti-prathidvani

అందరినీ నమ్మితే కొన్ని సందర్భాలలో సులభంగా మోసపోయా అవకాశం ఉంది. అలాగే మనకు పెద్దగా పరిచయం లేని, అలవాటు లేని ఫీల్డ్ లో కళ్ళు మూసుకొని డబ్బులు ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకూడదు. ఎక్కువ లాభం వస్తుంది అన్న పేరాశతో ఒక్కొక్కసారి మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ కారణంగా ఎదురు దెబ్బ తగిలి అవకాశం ఉంది. చాణుక్యుడు రాజశాస్త్రంలో ఎంతో ఆరితేరిన వ్యక్తి, అతను అందించిన నీతి సూక్తులు ఈరోజుకి కూడా మనకు మార్గదర్శ.

Ads

మనం చేసిన తప్పుల నుంచి నేర్చుకుని మన గెలుపు ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. ఎంత త్వరగా మనం మన ఓటమి నిచ్చెనను దాటుతాము అంత త్వరగా జీవితంలో ఉత్తమ ఫలితాలను పొందుతాము అని చాణిక్యుడు చెప్పారు. ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు మొదటగా మనల్ని మనం మూడు ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది..
నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను?
దాని ఫలితాలు ఎలా ఉండవచ్చు?
నేను అందులో విజయం సాధించగలనా?
ఈ ప్రశ్నలకు నీ దగ్గర సరియైన సమాధానం ఉంటే తప్పకుండా మీరు అనుకున్న పనిని ప్రారంభించవచ్చు. ఇందులో ఏ ఒక్క ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేకపోయినా మీరు త్వరలో నష్టాల్లో పూరికుంటారు అనేది గ్రహించాలి.

అప్పు శత్రువుతో సమానం…ఎప్పుడైతే అప్పు చేస్తాము అప్పుడు అవమానాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఎప్పుడూ అప్పు తీసుకోవడం అలవాటుగా చేసుకోకూడదు…తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవలసి వచ్చిన వీలైనంత త్వరగా తిరిగి చెల్లించాలి. అలాగే ప్రతిదానికి తీరాటికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు ప్రాక్టికల్ అనుభవం కూడా మనిషికి ఎంతో ముఖ్యం. ఒక పుస్తకం చదివినంత మాత్రాన అందులో ఉన్న జ్ఞానం మొత్తం నాకు వచ్చు అనుకుంటే అంతకంటే ముర్ఖత్వం ఇంకొకటి లేదు. తెలిసిన విషయాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలియకపోతే ఆ విషయం తెలుసుకోవడం వల్ల ఒరిగేది ఏమీ లేదు.

Previous articleమీ బోన్ హెల్త్ నెగ్లక్ట్ చేస్తున్నారా…. అయితే జాగ్రత్త…
Next articleసూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బాషా సినిమాని రిజెక్ట్ చేసిన ఇద్ద‌రు టాలీవుడ్ హీరోలు..