Ads
అలనాటి హీరోయిన్ వాణిశ్రీ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వాణిశ్రీ ఎన్నో గొప్ప సినిమాలలో నటించింది. అప్పటి అగ్ర హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించింది.
కళాభినేత్రిగా తెలుగు, కన్నడ, తమిళ ఇండస్ట్రీలలో నలబై సంవత్సరాలు రాణించింది. నటి వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. ఆమె మరపురాని కథ అనే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తరువాత హీరోయిన్ గా మారి, ఎన్నో చిత్రాల్లో నటించి 1970వ దశకంలో తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా నిలచింది.నటి వాణిశ్రీ 1948లో నెల్లూరులో ఆగష్టు 3న జన్మించారు. ఆమె అదే ఊరులో 9వ తరగతి వరకు చదువుకుంది. ఆ తరువాత ఆమె కుటుంబ పరిస్థితుల కారణంగా అక్కడి నుండి మద్రాసుకు వెళ్లిపోయారు. అక్కడే వాణిశ్రీ నటన పై ఉన్న ఆసక్తితో నాటకాల్లో మొదట చేరింది. ఆమె నటనను ఒక నాటకంలో చూసిన కన్నడ డైరెక్టర్ హుణనూరు కృష్ణమూర్తి తాను తీయబోయే సినిమా వీరసంకల్పలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. అలా ఆమె తమిళ, కన్నడ అగ్ర హీరోలు అయిన ఎంజిఆర్,రాజ్ కుమార్, శివాజీ గణేశన్ వంటి వారి పక్కన హీరోయిన్ గా నటిస్తూనే, తెలుగులో అగ్ర హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి వారితో ఎన్నో మరుపురాని సినిమాలలో హీరోయిన్ గా గుర్తుండిపోయే పాత్రలలో నటించింది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటించిన ‘ఎదురులేని మనిషి’ చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమాలో ఒక వాన పాట కోసం షూటింగ్ జరుగుతోంది. ఆ పాటలోని ఒక సిన్ లో డాన్స్ కొంచెం వల్గర్ గా ఉండడం వల్ల వాణిశ్రీ ఆ సన్నివేశాన్ని చేయనని సీరియస్ గా చెప్పిందంట. దాంతో ఈ విషయాన్ని ఎన్టీఆర్ కి చెప్పడంతో ఆయన వాణిశ్రీతో ఇలాంటి చిన్న విషయాలను చూసి చూడనట్లు పోతుండాలి అని చెప్పడంతో ఆమె వెంటనే షూటింగ్ నుండి వెళ్లిపోయారు. ఈ సన్నివేశం ఆ రోజుల్లో పెద్ద గొడవకు కారణం అయ్యింది. అయితే చివరికి ఆ సన్నివేశం తొలగించి, కొత్త సీన్స్ పెట్టి ఆ పాటను పూర్తి చేశారంట. ఇలాంటివి కొన్ని చిన్న సంఘటనలు జరగడంతో, ఆమె కుటుంబ పరిస్థితుల వల్ల వాణిశ్రీ మెల్లగా సినిమాలు తగ్గించుకుంటూ వెళ్లారు.
Ads
ఈ క్రమంలోనే వాణిశ్రీ డాక్టర్ కరుణాకర్ ని వివాహం చేసుకొని, పూర్తిగా సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి, కుటుంబ జీవితాన్ని ఆస్వాదించారు. అయితే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో అత్తగా, అమ్మ పాత్రలలోనూ గుర్తు ఉండిపోయే పాత్రలలో నటించారు. అలా అత్తకి యముడు కూతురికి మొగుడు అనే సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆ తరువాత బొబ్బిలి రాజా, సీతారత్నం గారి అబ్బాయి, ఖైదీ దాదా, ఏమండీ ఆవిడ వచ్చింది లాంటి చిత్రాలలో నటించి తన నటనను మరోసారి తెలుగు ఆడియెన్స్ కు చూపించారు.
Also Read: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బాషా సినిమాని రిజెక్ట్ చేసిన ఇద్దరు టాలీవుడ్ హీరోలు..