మెగాస్టార్ చిరంజీవి నటించిన ”అంజి” సినిమా ప్లాప్ అవడానికి గల కారణం ఏమిటో తెలుసా?

Ads

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమాలలో ‘అంజి’ సినిమా ఒకటి. ఈ సినిమాకు డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఫాంటసీ కథతో తెరకెక్కిన ఈ సినిమాను విజువల్ ఎఫెక్ట్స్ తో ఎంతో గ్రాండ్ గా కోడి రామకృష్ణ తెరకెక్కించారు.

Ads

2004లో సంక్రాంతి పండగ కానుకగా అంజి సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకోగలిగింది. అదే ఏడాది సంక్రాంతికి అంజితో పాటుగా బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ, ప్రభాస్ నటించిన వర్షం సినిమాలు బరిలోకి దిగాయి. దాంతో భారీ అంచనాలతో విడుదల అయిన అంజి సినిమా ఆ రెండింటికంటే వెనుకబడిపోయింది. ఇక ఈ సినిమా రిజల్ట్ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఆర్ధికంగా చాలా నష్టాన్ని తేవడమే కాకుండా, ఆయనని ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే అంజి సినిమా కాన్సెప్ట్ ని ఎలా ఎంచుకున్నారు, ఆ నేపథ్యం గురించి దివంగత దర్శకుడు కోడిరామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో తెలియచేసారు.
మెగస్టార్ చిరంజీవి ఆ సమయంలో ఇంద్ర, ఠాగూర్ లాంటి రెండు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి, మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక ఆ సమయంలో నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి మెగాస్టార్ తో భారీ గ్రాఫిక్ మూవీ చేయాలనే ఉద్దేశ్యంతో డేట్స్ తీసుకున్నారట. అయితే ఆ మూవీ తెరకెక్కించే బాధ్యతను దర్శకుడు కోడి రామకృష్ణకు అప్పచెప్పాడు. అది విన్న తరువాత చిరంజీవి వంటి స్టార్ హీరోతో కమర్షియల్ చిత్రం చేస్తేనే సరిగ్గా ఉంటుందని, నా వద్ద మంచి స్క్రిప్ట్ ఉంది. అందులో హీరోది డ్యూయల్ రోల్. ఆ స్టోరీతోనే సినిమా చేద్దాం అని కోడిరామకృష్ణ చెప్పారు. ఆయితే దానికి శ్యాంప్రసాద్ రెడ్డి ఒప్పుకోకుండా, ఎలాగైనా గ్రాఫిక్స్ సినిమానే చేయాలని చెప్పారంట. ఆ తరువాత చిరంజీవిని కన్విన్స్ చేయడానికి కోడి రామకృష్ణ వెళ్ళి,చెప్పగానే చిరంజీవి గ్రాఫిక్ సినిమాకే ఒకే చెప్పారంట. ఇక రామకృష్ణ కష్టపడి ఫాంటసీ కాన్సెప్ట్ తో చిరంజీవి కోసం స్క్రిప్ట్ రాసి, సినిమాను తీసారంట. అయితే అంజి సినిమా కోసం చాలా పరిశోధన చేసి చాలా కాలం షూటింగ్ చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అంజి మూవీ కోసం చాలా కష్ట పడ్డాడు. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ కోసం అయితే మెగాస్టార్ ఒకటే షర్ట్ ను ఉతకకుండా రెండు సంవత్సరాల పాటు వెసుకున్నాడంట. కొత్త నటుడిలా చాలా కష్టపడి చిరంజీవి నటించారని కోడిరామకృష్ణ తెలిపారు. అంతేకాకుండా సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ నాకు సంతృప్తిని ఇచ్చిన చిత్రం అంజి అని కోడి రామకృష్ణ అన్నారు.

Also Read: తనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ నే ప్రేమించి, పెళ్లి చేసుకున్న హీరో విక్రమ్..

Previous articleసమంత, సిద్ధార్థ్ లు నటించిన ”జబర్దస్త్” సినిమా ఎందుకు వివాదాస్పదం అయ్యిందో తెలుసా?
Next articleఎన్టీఆర్ మాట వినిపించుకోని కారణంగా వాణిశ్రీ పరిస్థితి ఎలా అయ్యిందో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.