ఎన్టీఆర్ రక్తం కారుతున్నప్పటికి, మిరపకాయలు ఎందుకు నమిలాడో తెలుసా?

Ads

అవి సాంఘిక సినిమాలకు ఆడియెన్స్ పెద్దపీట వేస్తున్న రోజులు.ఆ సమయంలో తెలుగు సీనియర్ హీరోలు అయిన ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ ల టైమ్ అయిపోయిందని ఎక్కువగా వినపడుతున్న రోజులు అవి. ఇక విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా పేరు గాంచిన ఎన్టీఆర్ నటన గురించి అందరికి తెలిసిందే.

Ads

అది కాకుండా ఎన్టీఆర్‌ కి తన పని పట్ల ఉండే నిబద్దత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ పనినే దైవంగా భావిస్తారు. ఆయన ఒకసారి షూటింగ్ కి వచ్చిన తరువాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ముందు అనుకున్న సన్నివేశాలను పూర్తిచేశాకే ఇంటికి వెళ్లేవారు. కొన్ని సందర్భాలలో ఫైట్ సీన్స్ లో నటిస్తున్నప్పుడు ఎన్టీఆర్ కి దెబ్బలు తగిలినా కూడా, ఆయన వాటిని పట్టించుకోకుండా షూటింగ్ పూర్తి చేసేవారంట. అలానే అది 1977లో ఎన్టీఆర్ ఎదురీత సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయం.ఎదురీత సినిమా షూటింగ్ సమయంలో ఏన్టీఆర్‌ చేసిన ఒక పనికి అక్కడున్న వారందరు షాక్ అయ్యారంట. ఏన్టీఆర్‌ హీరోగా డైరెక్టర్ మధుసూదనరావు దర్శకత్వంలో వాణిశ్రీ హీరోయిన్ గా ఎదురీత సినిమా మొదలైంది. ఈ చిత్రంలో విలన్‌ క్యారెక్టర్ చాలా కీలకమైనది. ఈ క్యారెక్టర్ లో కైకాల సత్యనారాయణ నటించారు. ఆ రోజే షూటింగ్ మొదలైంది. అందులో భాగంగా రన్నింగ్ షాట్స్ చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్, సత్యనారాయణ పరుగు పెడుతున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఇనుప రాడ్ ఎన్టీఆర్ ముఖానికి గట్టిగా తగిలి రక్తం కారిపోతుంది. అది చూసినవారందరూ కంగారుగా ఎన్టీఆర్ వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లారు.షూటింగ్‌ ను వెంటనే ఆపేసి ఎన్టీఆర్ తో పాటుగా అందరూ ఒడ్డుకు వచ్చేశారు. అయితే ఆ ఒడ్డు పక్కనే ఒక మిరప తోట ఉంది. మిరపకాయలను కోసి ఎండబెట్టారు. ఎన్టీఆర్ వాటిని చూసి, వెంటనే కొన్ని మిరపకాయలను తీసుకుని నములడం మొదలుపెట్టారు. పక్కనే కూర్చున్న వాణిశ్రీ ఎన్టీఆర్ చేస్తున్న దానికి అలాగే షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయింది. ఎన్టీఆర్‌ మిరపకాయలను ఫాస్ట్ గా నమిలేసి షూటింగ్‌ చేద్దాం పదండి అనుకుంటూ వెళ్లారంట. అయితే నొప్పిని తట్టుకోవడానికే ఎన్టీఆర్ ఆ మిరపకాయలు తిని షూటింగ్ లో పాల్గొన్నారంట. ఎన్టీఆర్ అంటే అది. పని మీద ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం ఆ ఘటన.

Also Read: ఎన్టీఆర్ మాట వినిపించుకోని కారణంగా వాణిశ్రీ పరిస్థితి ఎలా అయ్యిందో తెలుసా?

Previous article”గుమ్మడి” కూతురి పెళ్లికి ఎన్టీఆర్ ఎందుకు వెళ్ళలేదు..? ఇంత గొడవ జరిగిందా..?
Next articleసింహాద్రి, అత్తారింటికి దారేది సినిమాలలోని ఈ సీన్స్ గమనించారా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.