”గుమ్మడి” కూతురి పెళ్లికి ఎన్టీఆర్ ఎందుకు వెళ్ళలేదు..? ఇంత గొడవ జరిగిందా..?

Ads

గుమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుమ్మడి అందరికీ సుపరిచితమే. చాలా సినిమాలలో గుమ్మడి నటించి అందరిని ఆకట్టుకున్నారు. చిన్న వయసు లోనే గొప్ప పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసారు గుమ్మడి. పరిమితికి మించిన పాత్రలు చేసి గుమ్మడి ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే గుమ్మడి కూతురు పెళ్లికి ఎన్టీఆర్ ని పిలిచినా సరే ఎన్టీఆర్ రాలేదు.

ఎందుకు ఎన్టీఆర్ రాలేదు..? దానికి కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. గుమ్మడి ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో నటుడు నాగయ్య ఆఫీస్ లోనే ఒక రూమ్ లో ఉండేవారట.

మొదటి రెండు సినిమాలు చేసే దాకా ఆయన అక్కడే ఉన్నారు. తర్వాత ఆయన ఒక హోటల్ రూమ్ లో ఉండేవారు. అయితే అప్పుడు ఆ సమయం లో టిఎన్టి వారి ఆఫీస్ ఎదురుగా సంగీత దర్శకుడు టీవీ రాజు ఒక హోటల్లో ఎన్టీ రామారావు తో కలిసి ఉండే వారట. అప్పుడు ఎన్టీఆర్ కి గుమ్మడి పరిచయం అయ్యారు. ఇలా ఎన్టీఆర్ తన సొంత సినిమా లో గుమ్మడి కి అవకాశాన్ని ఇచ్చారు.

Ads

తర్వాత ఎన్నో సినిమాల్లో గుమ్మడి ఎన్టీఆర్ కలిసి నటించారు. తర్వాత ఎన్టీఆర్ కంటే కూడా అక్కినేని నాగేశ్వరరావు తో సినిమాలు ఎక్కువగా చేసేవారు గుమ్మడి. ఇది చూసిన ఎన్టీఆర్ గుమ్మడి అక్కినేని మనిషి అని భావించారు. ఎన్టీఆర్ తప్పుగా అర్థం చేసుకుని గుమ్మడిని దూరం పెట్టారు. తర్వాత అక్కినేని ఎన్టీఆర్ కలిసిపోయి గుమ్మడి విషయంలో చేసిన తప్పుని గ్రహించారు.

ఎన్టీఆర్ మళ్లీ సినిమాల్లో గుమ్మడి కి అవకాశాన్ని ఇచ్చారు. ఇలా ఎన్టీఆర్ కి గుమ్మడి కి చిన్న సైలెంట్ వార్ జరిగింది. మళ్లీ అక్కినేని ఎన్టీఆర్ గుమ్మడి కలిసిపోయారు. ఈ వార్ సమయంలో గుమ్మడి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి తన కూతురు పెళ్లి అని పిలిస్తే కూడా ఎన్టీఆర్ రాలేదు.

Previous articleపెళ్లికి ముందే పిల్లలకు జన్మనిచ్చిన సెల‌బ్రెటీలు వీరే..!
Next articleఎన్టీఆర్ రక్తం కారుతున్నప్పటికి, మిరపకాయలు ఎందుకు నమిలాడో తెలుసా?