Ads
ప్రేమించిన వ్యక్తి కోసం.. ప్రేమ కోసం ఆడపిల్లలు తల్లిదండ్రులని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు ఎంత బాధ పడతారు అనేది చాలా మంది ఆడపిల్లలు ఆలోచించరు. ఆరేళ్ల క్రితం కన్న కూతురు ఒక తో వెళ్లిపోయింది అయితే ఆ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయిని ఒక నెలకి వదిలేసాడు.
మూడు నెలలు తన కూతురు కోసం వెతికాడు తండ్రి అప్పుడు ముంబైలో ఒక స్లమ్ ఏరియాలో ఆమె కనపడింది. అప్పుడు ఆమె మూడు నెలల గర్భిణీ.
ఇంటికి తీసుకు రాకుండా తండ్రి కూడా అక్కడే ఉన్నాడు మానసికంగా ఆ అమ్మాయి కృంగిపోయింది. రాత్రిపూట నిద్ర లేచి ఎవరో తలుపు కొడుతున్నారు తీయండి అని బాగా అరిచేది. అప్పుడు తన తండ్రి ఎవరూ లేరని తలుపు తీసి చూపించేవారు. సంవత్సరం వరకు కూడా ఆమె మానసిక స్థితి అలానే ఉండిపోయింది ఇప్పుడు ఆమె ఒక బిడ్డకి జన్మనిచ్చింది. కానీ ఆ బిడ్డని ఆమె ఎవరికీ ఇవ్వదు.
Ads
తన బిడ్డ కూడా అందరికీ దూరంగా ఉంటుందని తన తండ్రి బాధపడ్డాడు. కొన్ని రోజులు తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని ఒక అతను వచ్చాడు. అతనికి ఆల్రెడీ పెళ్లయింది అతని భార్య చనిపోయింది. అయితే ఈ తండ్రి తన బిడ్డకు జరిగిన విషయాన్ని అతనికి చెప్పలేదు. ఏదో తప్పు చేస్తున్నానని మనసులో మాత్రం బాధ ఉంది. అతనికి చెబుదామని తండ్రి పిలిపించాడు. చెప్పబోయేలోగా అతను తనకి తెలుసని మీ కూతురు నాకు అన్నీ చెప్పిందని చెప్పాడు. ఇప్పుడు ఆమెకి పెళ్లయింది. కూతురు ప్రవర్తన లో ఎంతో మార్పు వచ్చింది ఈ వ్యక్తి తన బిడ్డని బాగా చూసుకుంటున్నారు.
రాత్రిపూట తలుపు తీయమని అరవడం కూడా మనింది. చాలామంది అమ్మాయిలు తెలిసి తెలియని వయసులో ప్రేమ, పెళ్లి అని తొందర పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఇలాంటి విషయాలు తెలుసుకుంటే జీవితం బాగుంటుంది. లేదంటే జీవితంలో లేని పోని సమస్యలు వస్తాయి ప్రేమ పెళ్లి అని చాలా మంది మోసం చేస్తున్నారు. ఇటువంటివి తెలుసుకుంటే ఆడపిల్లలు భవిష్యత్తు బాగుంటుంది. ప్రేమించడం తప్పు కాదు కానీ చాలామంది మోసపోతున్నారు అటువంటి మోసాలకి దూరంగా ఉండాలి. బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది. చేతులారా మీరే మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి.