Ads
చదువుకి నటనకి అస్సలు సంబంధం లేదని చాలా మంది నటులు ప్రూవ్ చేశారు ఈ నటులని చూస్తే చదువుకి నటనకి సంబంధం లేదని మనకి అర్థమవుతుంది. కొంత మంది హీరోలను చూస్తే ఏదో చదివేసారేమో అని అనుకుంటూ ఉంటాము కానీ చూస్తే డిగ్రీ పూర్తి చేస్తారు అంతే.
అయితే చాలా మంది సెలబ్రిటీలు ఏం చదువుకున్నారు అబ్బా అని మనకి అనిపిస్తూ ఉంటుంది.. మరి ఏ హీరోలు ఎంత వరకు చదువుకున్నారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
#1. నందమూరి తారక రామారావు:
నందమూరి తారక రామారావు గారు ఎస్సీ కాలేజ్ నుండి బిఏ పూర్తి చేశారు తర్వాత మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసారు. ఏడుగురిని ఇందులో ఎంపిక చేయగా ఆయన కూడ సెలెక్ట్ అయ్యారు. ఆ తరవాత సబ్ రిజిస్టర్ ఉద్యోగాన్ని వదిలేసి నటన వైపు వచ్చారు.
#2. అక్కినేని నాగేశ్వరరావు:
అక్కినేని నాగేశ్వరరావు గారు కేవలం మూడో తరగతి చదువుకున్నారు చిన్నప్పుడు నుండి నాటకాలు అంటే ఎంతో ఇష్టం అందుకే చదువుకోలేదు.
#3. శోభన్ బాబు:
శోభన్ బాబు బిఏ పూర్తి చేసే లా లో ఆయన అయిపోయారు తర్వాత మధ్యలోనే ఆపేసి సినిమాల్లోకి వచ్చేసారు.
#4. కృష్ణ:
ఏలూరులోని సి ఆర్ రెడ్డి కాలేజీలో బిఎస్సి పూర్తి చేశారు తర్వాత ఇంజనీరింగ్ సీట్ కోసం చూశారు సీటు రాకపోవడంతో సినిమాల్లోకి వచ్చేసారు.
#5. చిరంజీవి:
నరసాపురంలోని వైఎన్ కాలేజీలో బీకాం పూర్తి చేశారు చిరంజీవి.
#6. వెంకటేష్:
వెంకటేష్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు తర్వాత భారతదేశం వచ్చాక సినిమాల్లోకి వచ్చేసారు.
#7. బాలకృష్ణ:
బాలకృష్ణ హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం చదువుకున్నారు.
#8. నాగార్జున:
నాగార్జున మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో ఎమ్మెస్ చేశారు తర్వాత యాక్టింగ్ లోకి వచ్చేసారు నాగార్జున.
Ads
#9. మహేష్ బాబు:
మహేష్ బాబు మద్రాస్ లోని బీకామ్ పూర్తి చేశారు.
#10. పవన్ కళ్యాణ్:
పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ చదువుకున్నారు.
#11. ప్రభాస్:
భీమవరం డిఎన్ఆర్ స్కూల్లో స్కూలింగ్ పూర్తిచేసి హైదరాబాదులో బీటెక్ చేసారు.
#12. జూనియర్ ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లోనే ఇంటర్మీడియట్ చదువుకుని తర్వాత సినిమాల్లోకి వచ్చేసారు.
#13. రానా:
చెన్నై ఫిలిం స్కూల్ నుండి ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో ఆయన డిగ్రీ చేశారు.
#14. అల్లు అర్జున్:
హైదరాబాదులో ఎమ్మెస్సార్ కాలేజీలో బీబీఏ చదువుకున్నారు బన్నీ.
#15. రాజశేఖర్:
రాజశేఖర్ ఎంబిబిఎస్ పూర్తి చేశారు ఆ తర్వాత యాక్టర్ గా స్థిరపడ్డారు.
#16. రామ్ చరణ్:
రామ్ చరణ్ బీకాంలో మధ్యలోనే ఆపేసి సినిమాల్లోకి వచ్చేసారు.
#17. రవితేజ:
విజయవాడలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ నుండి బీఏ చదువుకున్నారు.
#18. నాని:
నాని కూడా డిగ్రీ పూర్తి చేశారు.
#19. విజయ్ దేవరకొండ:
విజయ్ దేవరకొండ బీకాం చదివి సినిమాలు లోకి వచ్చేసారు.
#20. నాగచైతన్య:
నాగచైతన్య కూడా బీకాం చదువుకునే సినిమాల్లోకి వచ్చేసారు.
#21. సాయిధరమ్ తేజ్:
బిఎస్సి బయో టెక్నాలజీ చదువుకుని తర్వాత ఎంబీఏ చేసి సినిమాల్లోకి వచ్చారు సాయిధరమ్ తేజ్.