Ads
నోబాల్స్ వల్ల క్రికెట్ లో మ్యాచ్ ఫలితాలు తలకిందులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఎక్స్ ట్రా రన్ ఒక్కటైనా కూడా మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుంది. బౌలర్లు ఎంత జాగ్రత్తగా బౌలింగ్ చేసినా నో బాల్స్ వేయడం జరుగుతూనే ఉంటాయి. అయితే కొందరు గొప్ప బౌలర్లు తమ కెరీర్ లో ఒక్క నోబాల్ వేయలేదు. నమ్మలేకపోయిన ఇది వాస్తవమే. అయితే అలాంటి బౌలర్లు ఇద్దరు, ముగ్గురు కాదు ఏకంగా 8 మంది ఉన్నారు. అసలు కెరీర్ మొత్తంలో ఒక్కసారి కూడా నోబాల్ వేయకుండా ఉండటం వారికి ఎలా సాధ్యమైంది.
Ads
అయితే బౌలర్లు క్రికెట్ లో నోబాల్ వేయడం చాలా సహజమైనది. ప్రతి మ్యాచ్‌లో దాదాపుగా ఒక్క నోబాల్ అయినా నమోదవుతుంది. అలాంటిది కెరీర్ మొత్తం కూడా నో బాల్ వేయకుండా ఉన్నారంటే క్రమశిక్షణ, బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇంత గొప్ప ఘనతను సాధించిన ఆ ఎనిమిది మంది బౌలర్లు ఎవరో చూద్దాం..
1.లాన్స్ గిబ్స్:
వెస్టిండిస్ స్పిన్నర్ లాన్స్ గిబ్స్ ఆడిన మ్యాచుల్లో 79 టెస్ట్ లు, 3 వన్డేలు ఉన్నాయి. అయితే గిబ్స్ ఒక్క నో బాల్ వేయలేదు.అంతేకాకుండా 300 వికెట్స్ వేగంగా తీసిన బౌలర్.
2.ఫ్రెడ్ ట్రూమన్:
ఈ ఇంగ్లండ్ పేస్ బౌలర్ కెరీర్‌లో 67 టెస్టులు ఆడాడు. ఒక్క నో బాల్ వేయలేదు.
3.గ్రేమ్ స్వాన్:
ఈ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ ఆడిన మ్యాచుల్లో 60 టెస్టులు, 79 వన్డేలు ఉన్నాయి. ఒక్క నోబాల్ కూడా వేయలేదు.
4.ఇయాన్ బోథమ్:
ఇయాన్ బోథమ్ ఇంగ్లాడ్ ఫాస్ట్ బౌలర్. అతను ఆడిన మ్యాచుల్లో 102 టెస్ట్ లు, 116 వన్డేలు ఉన్నాయి. అతని కెరీర్ లో ఒక్క నో బాల్ వేయలేదు.
5.ఇమ్రాన్ ఖాన్:
ఈ పాకిస్థాన్ బౌలర్ ఆడిన మ్యాచుల్లో 175 వన్డేలు, 88 టెస్ట్ మ్యాచ్ లు ఉన్నాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ ఒక్క నో బాల్ వేయలేదు.
6.డెన్నిస్ లిల్లీ:
డెన్నిస్ లిల్లీ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్. అతను ఆడిన మ్యాచుల్లో 70 టెస్ట్, 63 వన్డేలు మ్యాచ్ లు ఉన్నాయి. ఒక్క నో బాల్ కూడా వేయలేదు.
7.కపిల్ దేవ్:
కపిల్ దేవ్ భారత్ కి మొదటి వరల్డ్ కప్ తెచ్చిన కెప్టెన్ గా రికార్డ్ సృష్టించాడు.అతను ఆడిన మ్యాచుల్లో 131 టెస్ట్, 225 వన్డేలు మ్యాచ్ లు ఉన్నాయి. ఒక్క నో బాల్ కూడా వేయలేదు.
8.బాబ్ విల్లిస్:
బాబ్ విల్లిస్ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్. అతను ఆడిన మ్యాచుల్లో 90 టెస్టులు, 64 వన్డేలు ఉన్నాయి. కెరీర్‌లో ఒక్క నో బాల్ కూడా వేయలేదు.
Also Read: టెస్టు క్రికెట్ ఆడే సమయంలో ఆటగాళ్లు తెలుపు రంగు జెర్సీలనే ఎందుకు ధరిస్తున్నారు?