Ads
ఇండియాలో క్రికెట్ ని ఒక క్రీడలాగా చూడరు. క్రికెట్ ఒక మతం. ఇక్కడ క్రికెట్ ను అభిమానించని వారు ఉండరు. ఇక ప్రపంచంలో ఎన్ని దేశాలలో క్రికెట్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నా, భారత క్రికెట్ ఫ్యాన్స్ ని బీట్ చేసే వారే లేరనే చెప్పవచ్చు. ప్రస్తుతం టి 20 క్రికెట్ కే ఎక్కువ ఆదరణ ఉంది. అయితే 1990ల్లో, 2000 సంవత్సరాల్లో మాత్రం టెస్ట్ క్రికెట్ కు ఉండే క్రేజ్ గురించి చాలా మందికి తెలియదనే చెప్పాలి.
Ads
టి20 మ్యాచ్ ఆడేవారు వారి దేశానికి చెందిన జెర్సీ నీ ధరిస్తారు. కానీ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో మాత్రం అందరు తెలుపు రంగులో ఉన్న జెర్సీని మాత్రమే ధరిస్తారు. మరి అలా తెలుపు రంగు జెర్సీని ఎందుకు ధరిస్తారో చూద్దాం. క్రికెట్ పుట్టింది ఇండియాలో కాదు ఇంగ్లాండ్ లో 16వ శతాబ్దంలోనే ఈ క్రీడ పుట్టింది. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతుంది. ఇక తెలుపు రంగు జెర్సీ గురించి చూస్తే 18వ శతాబ్దంలో క్రికెట్ లోకి తెల్లని దుస్తుల్ని తీసుకు రావడం జరిగిందని తెలుస్తోంది. దీని వెనక ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి.ఆ రోజుల్లో ఎండగా ఎక్కువ ఉన్న సమయంలో క్రికెట్ ఆడే వారు. ఎందుకు అంటే ఇప్పుడు జరుగుతున్నట్టుగా అప్పట్లో రాత్రిపూట మ్యాచ్ లు జరిగేవి కాదు. దాంతో ఎనిమిది గంటల పాటు ఎండలో మైదానంలో ఉండేవారు. ఇక తెల్లని దుస్తులు ధరించినపుడు సూర్యకాంతిని అవి రిఫ్లెక్ట్ చేయడం వల్ల ఆటగాడి శరీరం పై ఎండ ఒత్తిడి ఎక్కువ లేకుండా, వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తెలుపు రంగు దుస్తుల్ని వాడడం మొదలుపెట్టారు.టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు అందులో ఎరుపురంగులో ఉండే బంతిని ఉపయోగిస్తారు. ఇక ఫీల్డులో ఎర్రని బాల్ ని తెల్లని రంగు బ్యాక్ డ్రాప్ లో గుర్తించడం చాలా తేలిక అవుతుంది. ఆ కారణం చేత కూడా తెల్లని జెర్సీనీ వాడడం జరుగుతోంది.
ఇంకో కారణం కూడా చెబుతారు బ్రిటిష్ వారు వైట్ కలర్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అది కాకుండా తెల్లని దుస్తులు ధరించడం ద్వారా అందరూ సమానం అని వారు భావిస్తారు. ఈ కారణాల వల్లే తెలుపు రంగు జెర్సీని టెస్ట్ క్రికెట్ ఆటగాళ్లు ధరించడం జరుగుతోంది. అది ఇప్పటికీ కూడా ఆనవాయితీగా వస్తోంది.
Also Read: విరాట్ కోహ్లీ దగ్గర ఉన్న 10 అత్యంత ఖరీదైన వస్తువులు ఏమిటో తెలుసా?