Ads
వీర సింహ రెడ్డి మూవీ విడుదల అయినప్పటి నుండి హనీ రోజ్ పేరు టాలీవుడ్ లో ఎక్కువగా వినపడుతోంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన ఈ మళయాళీ బ్యూటీ, ఆ సినిమాలో చేసిన అభినయానికి, ఆమె అందానికి తెలుగు వాళ్ళు ఫిదా అయ్యారు.
Ads
హనీ రోజ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లోనూ, ఆ తరువాత సినిమా సక్సెస్ పార్టీలో బాలక్రిష్ణతో షాంపేన్ షేర్ చేసుకున్నప్పటి నుండి ఈ హీరోయిన్ ఎవరా అని ఆమె గురించి తెలుగు ఆడియెన్స్ తెగ వెతుకుతున్నారు. మరి టాలీవుడ్ లో తళుక్కున మెరిసిన ఈ హనీ రోజ్ ఎవరో? ఆమె నేపద్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మలయాళ క్యాథలిక్ ఫ్యామిలిలో 1991లో హనీ రోజ్ జన్మించింది. ఆమె తండ్రి పేరు థామస్, తల్లి పేరు రోజ్. ఈ కుటుంబం కేరళలోని తోడుపూజలో ఉంటుంది. హనీ రోజ్ తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 14 సంవత్సరాలకే నటనలో కెరీర్ ప్రారంభించింది.
ఆమె మొదటి సినిమా 2005లో వచ్చిన బాయ్ ఫ్రెండ్ అనే మలయాళ చిత్రం. ఆ తరువాత మూడు ఏళ్ల పాటు మలయాళం, తమిళ, కన్నడంలో కొన్ని చిత్రాలలో నటించినా, ఆ సినిమాలు ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టలేదు. 2008వ సంవత్సరంలో డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ చేసిన ‘ఆలయం’ అనే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో శివాజీ హీరోగా నటించారు. అయితే హానీరోజ్ కి ఈ మూవీకి కూడా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. దాంతో తెలుగులో అవకాశాలు రాలేదు.
ఇక ఆమె వచ్చిన చోటుకే అంటే మళయాళం ఇండస్ట్రీకే తిరిగి వెళ్ళింది. 2012లో హనీ రోజ్ ‘త్రివేండ్రం లాడ్జి’ అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా ఆమెకు మంచి గుర్తింపుని ఇచ్చింది. ఇక ఆ మూవీ తరువాత ఆమెకు మలయాళంలో వరుస ఆఫర్స్ రావడంతో హోటల్ కాలిఫోర్నియా, 5 సుందరికల్, థాంక్ యు, మమ్ముట్టి నటించిన దైవతింటే స్వంతం అనే చిత్రాల్లో నటించింది. ఆ తరువాత టాలీవుడ్ లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 2014లో వచ్చిన హీరో వరుణ్ సందేశ్ ‘ఈ వర్షం సాక్షిగా’ మూవీలో సపోర్టింగ్ రోల్ లో నటించింది హనీ రోజ్. ఆమెకు ఈ సినిమాతో కూడా గుర్తింపు దక్కలేదు.
ఇక మలయాళంలోనే మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి అగ్రనటుల సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్న హనీ రోజ్ కి బాలయ్య వీర సింహ రెడ్డి సినిమాతో మళ్ళీ టాలీవుడ్ మూవీ ఆఫర్ వచ్చింది. అయితే అంతకు ముందు రెండు తెలుగు చిత్రాలలో నటించినప్పుడు రాని పేరు, గుర్తింపు వీర సింహ రెడ్డి మూవీతో ఆమెకు వచ్చింది. హనీ రోజ్ కి, రెండోసారి బాలక్రిష్ణతో నటించే ఛాన్స్ వచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రాబోతున్న బాలయ్య మూవీలో హనీ రోజ్ ను హీరోయిన్ గా ఒకే చేశారు.
Also read: నాటు నాటు పాట కొరియోగ్రాఫర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా?