పురాణాల్లో ఉపయోగించిన ఈ 10 శక్తివంతమైన ఆయుధాల గురించి మీరు విన్నారా..?

Ads

పురాణాలకి సంబంధించి ఏ విషయమైనా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. మన పూర్వీకులు మనకి రామాయణ మహాభారతాల గురించి చెబుతూ ఉంటారు. మనం పురాణాల్లో యుద్ధాల గురించి కూడా వింటూ ఉంటాం. చాలా యుద్ధాలు పురాణాల్లో ఉన్నాయి మహాభారతంలో చూసుకుంటే యుద్ధాలలో వేల రకాల ఆయుధాలను ఉపయోగించారు.

పురాణాల్లో ఎటువంటి ఆయుధాల గురించి చెప్పారు..? ఆయుధాలు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

#1. త్రిశూలం:

త్రిశూలం గురించి మనకి తెలుసు. త్రిశూలం ఒక ఆయుధం. శివుడు త్రిశూలాన్ని ధరిస్తాడు ఈ ఆయుధానికి మూడు పదునైన కోణాలు ఉంటాయి. ఈ ఆయుధంతో పరమశివుడు ఎంతో మంది రాక్షసులని సంహారం చేశారు. దుర్గాదేవి ఏడు చేతుల్లో ఓ చేతులో త్రిశూలం ఉంటుంది.

#2. పాశుపతాస్త్రం:

ఇది అత్యంత విద్వాంసాన్ని సృష్టించిన అస్త్రం. శివుడు, కాళీమాత, ఆది పరాశక్తి యొక్క ఆయుధం ఇది. మహాభారతం ప్రకారం అర్జునుడు పరమశివుడు నుండి ఈ ఆయుధాన్ని పొందాడు.

#3. సుదర్శన చక్రం:

మహావిష్ణువు కుడి చేతిలో సుదర్శన చక్రాన్ని పట్టుకొని ఉంటాడు. మిగిలిన చేతుల్లో శంఖం, గద, పద్మం ఉంటాయి. సుదర్శన చక్రంతో శ్రీమహావిష్ణువు ఎంతో మంది రాక్షసులను సంహరించాడు. తేజస్సుకు చిహ్నం సుదర్శన చక్రం.

#4. వజ్రాయుధం:

ఇంద్రుడి ఆయుధం వజ్రాయుధం దదిచి మహర్షి వెన్నెముకతో ఈ ఆయుధాన్ని రూపొందించారు. ఎంతో శక్తివంతమైన బ్రహ్మండాస్త్రం ఇది.

#5. బ్రహ్మాండాస్త్రం:

ఇది కూడా చాలా శక్తివంతమైన అస్త్రం. విశ్వామిత్రుడు తో యుద్ధం జరుగుతున్న సమయంలో బ్రహ్మశ్రీ వశిష్ట బ్రహ్మాండస్త్రాన్ని ఉపయోగించారు.

Ads

#6. బ్రహ్మశిర:

బ్రహ్మస్త్ర కంటే నాలుగు రెట్లు ఇది శక్తివంతమైనది. ఇంద్రజిత్తు 670 మిలియన్ మందిని ఒకేసారి చంపడానికి ఉపయోగించారు. అశ్వద్ధామ కూడా బ్రహ్మశిర ని ఉపయోగించారు.

#7. భార్గవస్త్రము:

పరశురాముడు కర్ణుడికి దీనిని ఇచ్చారు గ్రహాన్ని మొత్తం తగలబెట్టే శక్తి దీనికి ఉంది ఇంద్రస్త్రం కంటే ఇది చాలా శక్తివంతమైనది.

#8. నారాయణ అస్త్రము:

ఇది కేవలం జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఉపయోగించడానికి అవుతుంది. ఇది చాలా బాణాలతో డిస్క్ లాగ ఉంటుంది.

#9. తీన్ బాన్:

బార్బరీక దీనిని దేవి సిద్ధి ధాత్రి నుండి తీసుకున్నారు. మహా భారత యుద్ధం లో బార్బరీక కనుక ఉంటే 30 సెకండ్ల లో యుద్ధాన్ని ముగించేది అని అంటారు. ఒకేసారి ఆయుధం ద్వారా మూడు బాణాలను వదలొచ్చు.

#10. బ్రహ్మాస్త్ర:

రామాయణంలోనే బ్రహ్మాస్త్రం ప్రస్థానం జరిగింది. హనుమంతుడిని బంధించడానికి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని విడిచి పెట్టడం జరుగుతుంది. అయితే బ్రహ్మాస్త్ర వలన హనుమంతుడికి ఎటువంటి ప్రభావం పడదని బ్రహ్మ వరమిచ్చాడు. కానీ బ్రహ్మ పట్ల గౌరవం వలన హనుమంతుడు మూర్ఛపోయినట్టు నటిస్తాడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించిన తర్వాత ఇతర అస్త్రాలని ప్రయోగించడం కుదరదు.

ఒకసారి లక్ష్మణుడు యుద్ధ సమయంలో బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించకపోతే రాముడు వారించాడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తే లోక వినాసానికి దారితీస్తుంది. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని యుద్ధం సమయంలో ఒకసారి ఉపయోగిస్తాడు అప్పుడు సమస్త వానర సేన మూర్ఛపోతుంది.

Previous articleట్రైన్ లో టికెట్ రిజర్వ్‌ చేసుకొని, ట్రైన్ ను మిస్ అయినపుడు ఆ సీటును ఏం చేస్తారో తెలుసా?
Next articleహనీ రోజ్ వీరసింహరెడ్డి సినిమా కన్నా ముందు హీరోయిన్ గా ఏ తెలుగు సినిమాలో నటించిందో తెలుసా ?