ఎందుకు ”నెంబర్ ప్లేట్స్” వేరు వేరు రంగుల్లో ఉంటాయి..? దాని వెనుక ఇంత పెద్ద కారణమా..?

Ads

ఏ వాహనానికైనా కచ్చితంగా నెంబర్ ప్లేట్ ఉండాలి. నెంబర్ ప్లేట్ లేకపోవడం తప్పు. అయితే నెంబర్ ప్లేట్లను గమనిస్తే అవి వివిధ రంగుల్లో ఉంటాయి. తెలుపు రంగు, నలుపు రంగు, ఎరుపు రంగు, పసుపు రంగు ఇలా రకరకాల రంగుల్లో నెంబర్ ప్లేట్స్ ఉంటాయి. అయితే ఎప్పుడైనా మీకు ఈ సందేహం కలిగిందా..? ఎందుకు అన్ని నెంబర్ ప్లేట్లు ఒకే రంగులో ఉండవు..

వివిధ రంగుల్లో ఉంటాయి అని.. మరి దాని వెనుక కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ రంగులలో నెంబర్ ప్లేట్లని రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ జారీ చేస్తుంది మనదేశంలో ఎనిమిది రకాల నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి.

నెంబర్ ప్లేట్లలో రకాలు:

  • తెలుపు రంగు
  • ఆకుపచ్చ రంగు
  • పసుపు రంగు
  • ఎరుపు రంగు
  • నీలం రంగు
  • నలుపు రంగు
  • బాణం గుర్తు పైకి ఉండే నెంబర్ ప్లేట్
  • జాతీయ చిహ్నం కలిగిన ఎరుపు రంగు నెంబర్ ప్లేట్

1. తెలుపు రంగు నెంబర్ ప్లేట్:

ఈ నెంబర్ ప్లేట్ తెలుపు రంగులో ఉంటుంది. అక్షరాలు మాత్రం నలుపు రంగులో ఉంటాయి.ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వాహనం అది అని దానికి అర్ధం. కేవలం పెర్సనల్ యూజ్ కోసమే ఇది.

2. ఆకుపచ్చ రంగు నెంబర్ ప్లేట్:

ఈ నెంబర్ ప్లేట్ ఇస్తే అది ఎలక్ట్రిక్ వాహనమని. ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైకులు వంటి వాటికి ఈ ప్లేట్లు ఇస్తారు. వీటి మీదనా తెల్లని రంగులో అక్షరాలు ఉంటాయి. అదే కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలకు అయితే ఆకుపచ్చవి ఇస్తారు. పసుపు రంగు అక్షరాలు ఉంటాయి.

Ads

3. పసుపు రంగు నెంబర్ ప్లేట్:

నగరాల్లో ఎక్కువగా దీన్ని ఇస్తారు. అలానే బస్సులకు, క్యాబులకి కూడా ఇస్తారు. కమర్షియల్ పర్పస్ కోసం వాడే వాహనాలకు దీన్ని ఇస్తారు. నల్లని అక్షరాలు దీని మీద ఉంటాయి.

4. ఎరుపు రంగు నెంబర్ ప్లేట్:

ఎరుపు రంగు లో ఉండి తెలుపు రంగు అక్షరాలు దాని మీదనా వుంటే అది తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్. శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ వచ్చే వరకు దీన్ని ఇస్తారు.

5. నలుపు రంగు నెంబర్ ప్లేట్:

కమర్షియల్ వాహనాలుగా రిజిస్టర్ అయ్యుంటే ఆ వాహనాలకు నలుపు రంగు నెంబర్ ప్లేట్ ఇస్తారు. పసుపు రంగు అక్షరాలు వీటి మీద ఉంటాయి.

6. నీలం రంగు నెంబర్ ప్లేట్:

నీలం రంగు నెంబర్ ప్లేట్ మీద అక్షరాలు తెలుపు రంగులో వుంటే విదేశీ దౌత్యవేత్తల కోసం దీన్ని వినియోగిస్తారు. విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ వ్యక్తులు కోసం ఈ కార్లని వాడతారు. CC- కాన్సులర్ కార్ప్స్, UN- యునైటెడ్ నేషన్స్, DC- డిప్లొమాటిక్ కార్ప్స్ వంటి వాళ్లకి దీన్ని వాడతారు.

7. నలుపు రంగులో పైకి బాణం గుర్తు వుండే నెంబర్ ప్లేట్:

మిలిటరీ వాహనాలకు దీన్ని వాడతారు. బ్రాడ్ ఏరో అంటారు దీన్ని. బాణం తరవాత రెండు అంకెలు ఉంటాయి.

8. ఎరుపు రంగు జాతీయ చిహ్నం కలిగిన నెంబర్ ప్లేట్:

రాష్ట్ర గవర్నర్ ఉపయోగించే కార్ కి ఉంటుంది. ఒకవేళ బంగారు జాతీయ చిహ్నం ఉన్నట్టయితే అది రాష్ట్రపతికి చెందిన వాహనం.

Previous article”ఈ కామర్స్” సైట్లకి ఎలా లాభాలు వస్తాయి..? డిస్కౌంట్లు, ఫ్రీ డెలివరీ ఇలా ఎన్నో ఇస్తున్నాను..!
Next article‘పుష్ప’ సినిమాలో సుకుమార్ చేసిన ఈ మిస్టేక్ ను గమనించారా?