”ఈ కామర్స్” సైట్లకి ఎలా లాభాలు వస్తాయి..? డిస్కౌంట్లు, ఫ్రీ డెలివరీ ఇలా ఎన్నో ఇస్తున్నాను..!

Ads

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఆన్లైన్ ద్వారానే షాపింగ్ చేయడానికి ఇష్ట పడుతున్నారు టైం లేక కొందరు డిస్కౌంట్స్ ఎక్కువగా ఉంటాయని మరి కొందరు ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేస్తున్నారు. ఫోన్ పట్టుకొని క్షణాల్లో మనం మనకి కావాల్సినది ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఏదైనా ఆఫర్ లో ఉన్నవి అవసరమైతే వెంటనే మనం ఆర్డర్ చేసుకోవచ్చు వారం దాటకుండానే మనం ఆర్డర్ చేసిన వస్తువు మన ఇంటికి వస్తుంది. ఈ కామర్స్ సైట్లలో ప్రతిదీ ఇప్పుడు అందుబాటులో ఉంటోంది.

చిన్న చిన్న సామాన్ల నుండి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు అన్నీ కూడా మనకి ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి ఈ కామర్ సైట్లు కూడా ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు.

కస్టమర్లకి వివిధ రకాల ఆఫర్లను కూడా ఇస్తూ ఉంటారు. మొదటి ఆర్డర్ కి డిస్కౌంట్ అని… లేదంటే ఫెస్టివల్ టైమ్స్ లో సేల్స్ అని ఇలా రకరకాల ఆఫర్లని మనకి ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీకు ఈ సందేహం వచ్చిందా..? ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లు అంటూ మనకి తక్కువ ధరకే సామాన్లు అమ్మితే వాళ్లకి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి..?, ఎలా వాళ్లకి లాభం..? చాలామందికి ఈ సందేహం ఉంటుంది కానీ సమాధానం తెలియకపోవచ్చు మరి ఆ సమాధానం ఇప్పుడు చూసేయండి.

Ads

ఈ కామర్స్ సైట్లు ఏవైనా కూడా వస్తువులని అమ్మకానికి మరియు కొనుగోలు చేయడానికి ఒక ప్లాట్ ఫామ్ ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే వస్తువులను ఉత్పత్తి చేసే వాళ్ళు రిటైల్లో సేల్ చేసే వాళ్ళు సెల్లార్లగా రిజిస్టర్ అవుతారు. వాళ్ల యొక్క ప్రొడక్ట్స్ ని ఈ కామర్స్ సైట్లలో పెడతారు. కస్టమర్లు వాళ్ళకి నచ్చిన వస్తువులని ఈ కామర్స్ సైట్లు లో వెతుక్కుని నచ్చిన దానిని కొంటుంటారు. ఒకవేళ కనుక మనకి ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే దానిని మనం రిటర్న్ చేయొచ్చు కూడా.

అయితే ఈ ప్రొడక్ట్స్ ఖర్చు, ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా ఎవరైతే ఈ కామర్స్ సైట్లో విక్రయాలు చేస్తారో వారే భరించాలి.  ఈ కామర్ సైట్ కి ఎలా లాభం అంటే.. సైట్ లో అమ్మకాలు చేయడానికి ఈ కామర్స్ సైట్స్ అవకాశాలు కల్పిస్తారు వాళ్ళు ఈ కామర్స్  సైట్ కి కమిషన్ ని ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది ప్రోడక్ట్ మీద 17% లేదంటే అంతకంటే ఎక్కువ శాతం కమిషన్ ఇస్తూ ఉంటారు. ఇలా ఈ కామర్స్ సైట్లకి లాభాలు వస్తాయి.

Previous articleకమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాలోని ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
Next articleఎందుకు ”నెంబర్ ప్లేట్స్” వేరు వేరు రంగుల్లో ఉంటాయి..? దాని వెనుక ఇంత పెద్ద కారణమా..?