Ads
ఏ స్కూల్ బస్సు అయినా కాలేజ్ బస్ అయినా సరే గమనిస్తే.. ఆ బస్సు రంగు పసుపు రంగు లో ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఈ డౌట్ వచ్చిందా..? ఎందుకు కాలేజీ బస్సులు స్కూల్ బస్సులు పసుపు రంగులో ఉంటాయి అని.. చాలా మంది బస్సులు పసుపు రంగులో ఉండడాన్ని గమనించి ఉంటారు కానీ దాని వెనుక కారణాన్ని తెలుసుకొని ఉండరు.
మరి ఎందుకు స్కూల్ బస్సులు ఆ రంగులోనే ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. నిజానికి దీని వెనక శాస్త్రీయ కారణం ఉంది.
మామూలుగా మనం ఆర్టీసీ బస్సులు వంటివి చూస్తే ఆకు పచ్చ రంగులో నీలం రంగులో లేదంటే ఇతర రంగుల్లో ఎక్కువగా ఉంటాయి. స్కూల్ బస్సులు కాలేజీ బస్సులు ఇలా విద్యా సంస్థలకు చెందినవి అయితే పసుపు రంగులో ఉంటాయి. నిజానికి చాలా దేశాల్లో పసుపు రంగుని మాత్రమే వాడుతూ ఉంటారు. విజిబుల్ స్పెక్ట్రమ్ లో ఏడు రంగులు ఉంటాయి. VIBGYOR. ఇవి వేవ్ లెన్త్ ఆర్డర్ లో ఎరేంజ్ చేయబడ్డాయి. పసుపు రంగుని దూరం నుండి చూస్తే కూడా క్లియర్ గా కనపడుతుంది. ఇది ఎంతో ఆకర్షణీయమైన రంగు.
Ads
దూరం లో వున్నా సరే కంటికి స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాదు వాతావరణం బాగోకపోయినా కూడా క్లియర్ గా ఉంటుంది. మిగిలిన రంగుల కంటే 1.24 రెట్లు ఎల్లో కలర్ కళ్ళను ఆకర్షిస్తుంది. ఈ కారణంగానే పసుపు రంగు ఈజీగా మనకి కనబడుతుంది. పైగా పొగ, మంచు, చీకటి ఏదైనా సరే మనం పసుపు రంగుని ఈజీగా చూడొచ్చు.
దీనితో ప్రమాదాలు కూడా సంభవించవు. అందుకనే స్కూల్ బస్సులకి ఈ రంగులనే వేస్తూ ఉంటారు. జేసీబీ, క్రేన్స్ వంటి వాటికి కూడా అందుకే పసుపు రంగునే వాడతారు. బస్సు పసుపు రంగు లో ఉండడం వలన యాక్సిడెంట్స్ వంటివి జరిగే ప్రమాదం కూడా తక్కువ ఉంటుంది.
పిల్లలకి ప్రమాదం కలగదు. చాలా మందికి మరో సందేహం కూడా ఉంటుంది. పసుపు రంగు కంటే ఎరుపు రంగే బ్రైట్ గా ఉంటుంది కదా అని.. పసుపు రంగు యొక్క తరంగదైర్ఘ్యం (wave lenght) (580nm), ఎరుపు రంగు (650nm). కానీ పసుపు రంగు యొక్క పార్శ్వ పరిధీయ దృష్టి (lateral peripheral vision) ఎరుపు రంగు కంటే 1.24 రెట్లు ఎక్కువ.