ఇంకా చాలా మంది నాయకులు ఉండగా… కరెన్సీ నోటు మీద ”గాంధీ” గారి ఫోటో ఏ ఎందుకు..?

Ads

ఈరోజుల్లో దేనినైనా డబ్బే నడిపిస్తుంది. మనతో మన చుట్టాలు ఆత్మీయంగా పలకరించాలన్నా స్నేహంగా ఇతరులు మనతో ఉండాలన్నా ఇవన్నీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటున్నాయి. డబ్బు ఉంటే మనుషులు దగ్గరగా ఉంటున్నారు అదే డబ్బు లేకపోతే ఆ మనిషి ముఖాన్ని కూడా చూసేందుకు ఇష్టపడటం లేదు. ఈ రోజుల్లో ఇలానే జరుగుతోంది. అయితే మన కరెన్సీ నోట్ల మీద గాంధీ తాత బొమ్మ కనపడుతూ ఉంటుంది.

ఎందుకు గాంధీ తాత బొమ్మ మాత్రమే కరెన్సీ నోట్ల మీద ముద్రించారు..? ఈ సందేహం మీకు కలిగిందా..? నాకు చాలా సార్లు కలిగింది. మీకు కూడా ఈ సందేహం ఉన్నట్లయితే ఇప్పుడే క్లియర్ చేసుకోండి.

గాంధీ గారి ఫోటోని ఎందుకు కరెన్సీ నోట్ల మీద ముద్రించారు..? ఎందుకు కేవలం ఈ ఫోటోనే కరెన్సీ నోట్ల మీద వేశారు అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం. మనకి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొత్త నోట్లని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించింది. అప్పుడు మన కరెన్సీ నోట్ల మీద జాతీయ చిహ్నం ఉండేది. 90లో పుట్టిన వాళ్లు ఆ ముందు పుట్టిన వాళ్ళు ఈ నోట్లని చూసే ఉంటారు. అశోక స్తంభం మీద సింహం బొమ్మలు ఉండేవి. అప్పట్లో నాణాల మీద కూడా ఇదే చిహ్నం ఉండేది. జాతీయ చిహ్నం కంటే ముందు చూస్తే నాలుగవ కింగ్ అయిన జార్జ్ ఫోటో ని ప్రింట్ చేశారు.

Ads

  • 1938 లో 11 ఏళ్ల పాటు మన నోట్ల మీద అతని ఫోటో ఏ ఉండేది. 1938 జనవరి నెలలో మొట్టమొదటిసారి ఐదు రూపాయల నోట్లోని ప్రింట్ చేశారు. తర్వాత పది రూపాయల నోట్లని వంద, వెయ్యి, పది వేలని ప్రింట్ చేశారు అప్పుడు అతని ఫోటో తీసేసి జాతీయ చిహ్నాన్ని ప్రింట్ చేశారు.
  • 1960 లో ఆర్థిక పరిస్థితి బాలేదు. అప్పుడు తిండి కూడా కష్టం అయ్యింది. దీనితో 1967లో నోట్ల సైజుని తగ్గించేశారు.
  • 1969లో జాతిపిత మహాత్మా గాంధీ శత జయంతి సందర్భంగా 2, 5, 10, 100 రూపాయల మీద ఆయన ఫోటో ని ప్రింట్ చేసారు. సేవాగ్రాం ఆశ్రమంలో మహాత్మా గాంధీ కూర్చుని ఉన్న ఫోటో అది. రూపాయి నోట్ల మీద అయితే గాంధీ సైడ్ ఫేస్ వేశారు.

  • అయితే కొన్ని నోట్ల మీద మాత్రమే గాంధీ బొమ్మ ని 1996 ముందు వరకూ వేసేవారు. కానీ 1996 తర్వాత ప్రతీ నోటు మీదా కూడా ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. డూప్లికేట్ నోట్లు చెయ్యడం కష్టం అనే ఇలా నిర్ణయం అప్పట్లో తీసుకున్నారు.

మిగిలిన నాయకుల ఫోటోలని ఎందుకు ముద్రించలేదు..?

ఇంకా చాలా మంది లీడర్స్ వున్నారు కానీ గాంధీనే ఎంచుకున్నారు. ఎందుకంటే ప్రాతీయ భేదాలు రాకూడదనే. జాతిపిత కనుక గాంధీ ఫోటోనే కరెన్సీ నోట్ల మీద ముద్రించారు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది.

ఆ గాంధీ ఫోటో ఎక్కడిది..?

ఇప్పుడు రాష్ట్రపతి భవన్ అయిన వైశ్రాయ్స్ హౌజ్ లో లార్డ్ ఫ్రెడ్రిక్ పెథిక్ లారెన్స్ ని గాంధీ మీట్ అయినప్పటి ఫోటో ఇది. ఈ ఫోటో ని గుర్తు తెలియని ఫోటోగ్రాఫర్ 1946లో తీశారు.

మళ్ళీ గాంధీ ఫొటోలో మార్పులు..

  • నవ్వుతున్న ఫోటోని ఆ తరవాత 1987లో నోట్ల మీద ప్రింట్ చేసారు.
  • టెక్సెక్యూరిటీ ఫీచర్స్ తో గాంధీ బొమ్మతో వుండే కరెన్సీ ని ఆ తరవాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1996లో ప్రింట్ చేయడం మొదలు పెట్టింది.
  • అలా తరవాత నుంది ఇంకొన్ని ఫీచర్స్ యాడ్ అయ్యాయి. వాటర్ మార్క్ అని విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్, లేటెంట్ ఇమేజ్, ఇలా.
Previous articleపెళ్లి లో ”జీలకర్ర బెల్లం” ఎందుకు పెట్టిస్తారు..? ఇంత పెద్ద కారణమా..?
Next articleస్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు ఎందుకు ”పసుపు” రంగులోనే ఉంటాయి..? ఇంత పెద్ద కారణం ఉందని మీకు తెలుసా..?