Ads
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి. ఈ మూవీతో జక్కన్న తెలుగు చిత్ర ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పారు. ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రలలో నటించారు.
Ads
బాహుబలి-ది బిగినింగ్ సినిమా 2015లో జూలై 10న రిలీజ్ అయ్యి, రికార్డులను తిరగ రాసింది. ఇక బాహుబలి మొదటి భాగం పాన్ ఇండియా మూవీగా దేశవ్యాప్తంగా అందరిని అలరించింది. బాహుబలి మొదటి పార్ట్ ను కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నతో ముగించారు. ఇక ఆ ప్రశ్నతో రెండవ భాగం పై అందరికి క్యూరియాసిటీ పెరిగింది. ఈ ప్రశ్న కూడా చాలా పాపులర్ అయ్యింది. దీని పై పెద్ద చర్చనే జరిగిందని చెప్పవచ్చు.రెండు ఏళ్ల తరువాత ఎన్నో అంచనాల మధ్య బాహుబలి-కంక్లూజన్ 2017లో ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యింది. ఊహించని విధంగా విజయం సాధించింది. ఇండియాలోనే వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. తెలుగులో తెరకెక్కిన బాహుబలి 2 హిందీ, తమిళ, మళయాళ భాషల్లోకి అనువాదమైన అద్భుతమైన విజయాన్ని పొంది, అన్ని భాషల వారు తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది. ఈ చిత్రానికి మూడవ భాగం కూడా ఉంటుదని తెలుస్తోంది.
బాహుబలి సినిమాలో రానా దగ్గుబాటి భళ్లాల దేవుడి పాత్రలో కనిపించారు. అయితే బాహుబలి మరణించిన తర్వాత వయసు పైబడిన భళ్లాలదేవుడిగా కనిపించాడు.అంతే కాకుండా రెండవ పార్ట్‌లో భళ్లాలదేవుడి ముఖం పై గీత కూడా ఉంటుంది. అది ఎలా వచ్చిందనేది బాహుబలి ఫ్యాన్స్ కి గుర్తుండే ఉంటుంది. ఇక ఆ గాయాన్ని భళ్లాలదేవుడు తన చేతులతో తానే చేసుకుంటాడు. కుమార వర్మ పాత్ర వచ్చి తనకు హాని చేశాడని అందరినీ నమ్మించడం కోసం ఆ గాయాన్ని చేసుకుంటాడు. అదే ఈ గీత. అయితే రాజమౌళి ఎక్కడా కూడా అది మిస్ అవకుండా చాలా జాగ్రత్తపడ్డాడు. అందువల్లే ఈ చిత్రంలో రానా ముఖం పై ఆ గాయం కనిపిస్తుంది. ఇక రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో పాన్ వరల్డ్ సినిమాను చేయబోతున్నారు.
Also Read: ”గుమ్మడి” కూతురి పెళ్లికి ఎన్టీఆర్ ఎందుకు వెళ్ళలేదు..? ఇంత గొడవ జరిగిందా..?